

మన న్యూస్ ,కావలి, మే 4:-కావలి మండలం ఆర్యవైశ్య సంఘం కార్యాలయంలో సంఘం అధ్యక్షులు “తటవర్తి రమేష్ ఆయన సతీమణి శిరీష” ఆధ్వర్యంలో పదోతరగతి, ఇంటర్మీడియట్ లో అత్యధిక మార్కులు( 580పైబడిన )సాధించిన విద్యార్థి,విద్యార్థులకు ఆదివారం సన్మాన కార్యక్రమం నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా కావలి అన్నదాత “ప్రాసమణి” పాల్గొని టెన్త్, ఇంటర్ ,20 మంది విద్యార్థులకు శాలువా కప్పి, షీల్డ్ లను,గిఫ్టులు అందజేసి సన్మానించారు.తటవర్తి రమేష్ ఆర్యవైశ్యలకు చేస్తున్న సేవలు గురించి కొనియాడారు.ఆర్థిక స్తోమత లేని పేదఆర్యవైశ్య విద్యార్థుల ఉన్నతచదువు కోసం అండగా ఉంటామని తట వర్తిరమేష్ అన్నారు. ప్రతి ఒక్క ఆర్యవైశ్య విద్యార్థి బాగా చదువుకొని ఉన్నత స్ధానంలో నిలవాలి,ఆర్యవైశ్యలు పేరు నిలబెట్టాలని కోరారు. ఈ కార్యక్రమంలో సంఘం నేతలు ఒరుగంటి రామకృష్ణ, ఒరుగంటి సురేష్,వేముల సునీల్,మంచిగంటి మురళి,గాధంశెట్టి మధు,కోట రమేష్ ,చెన్న కొండల రావు,సోమిశెట్టి ఉమ,సందీప్,గాధంశెట్టి వంశీ ,విద్యార్థులు పాల్గొన్నారు.
