

కుటుంబ ఆత్మీయత ఆరాధన లో పాల్గొన్న ప్రభుత్వ విప్ జీడీ నెల్లూరు ఎమ్మెల్యే
మన న్యూస్, ఎస్ఆర్ పురం:- సి ఎస్ ఐ చర్చ్ అభివృద్ధికి సహకరిస్తా జీడీ నెల్లూరు ఎమ్మెల్యే డాక్టర్ వి.ఎం థామస్ అన్నారు శనివారం ఎస్ఆర్ పురం మండలం చిన్నతయ్యూరు సిఎస్ఐ కల్వరి మౌంటెన్ చర్చ్ ఆధ్వర్యంలో కుటుంబ ఆత్మీయత ఆరాధన సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చర్చి అభివృద్ధికి అన్ని విధాల సహకరిస్తానని అన్నారు. అన్ని మతాలు ఒకటేనని హిందువైన ముస్లిం అయినా క్రైస్తవులైన అందరిదీ మానవత్వం మతం అని అన్నారు అందరూ కలిసిమెలిసి గా ఉండాలని తెలిపారు. అనంతరం మత పెద్దలు చర్చికి రోడ్డు సౌకర్యం కావాలని త్వరగా వెంటనే స్పందిస్తూ సిసి రోడ్డు ను త్వరలోనే మంజూరు చేస్తానని హామీ ఇచ్చారు. అంతకుముందుగా ఎమ్మెల్యే డాక్టర్ వి.ఎం థామస్ ను మత పెద్దలు ఘనంగా పుష్పగుచ్చం అందించి సాలువతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు జయశంకర్ నాయుడు, యువ నాయకుడు సాఫ్ట్వేర్ బాలు, వేమన నాయుడు, మండల ఎస్సీ సెల్ ఉపాధ్యక్షులు నాగరాజు, పైనేని మురళి, దాసరి సతీష్, సురేష్ ,మధు, మాజీ సర్పంచ్ భూపతి రెడ్డి, సిద్దయ్య శెట్టి, ధనుంజయ నాయుడు, టిడిపి నాయకులు, కార్యకర్తలు అభిమానులు ప్రజలు పాల్గొన్నారు.
