

ఏఈఓ ఓబయ్య
కడప జిల్లా: గోపవరం: మన న్యూస్: మే 02: గోపవరం మండలం రాచేయపేట గ్రామ పంచాయతీ నందు వ్యవసాయ విస్తరణ అధికారి ఓబయ్య శుక్రవారం పర్యటించారు, అయితే అదృష్ట్యావశత్తు ఈ అకాల వర్హం వల్ల ఎక్కడ రైతులు నష్టపోలేదు, ఇకముందు ఈ విదంగా వర్షాలు పడితే పెసర, వేరుశనగ పంటలు నష్టపోయే అవకాశాలు ఉన్నాయి, కాబట్టి కాయ్యల్లో నిల్వ ఉన్న నీళ్లు బయటికి వదలాలి, అలాగే వేరుశనగ వేసిన రైతులు ఈ సమయం లో తగు జాగ్రత్తలు తీసుకోకపోతే కొంచం ఇబ్బందులు ఎదుర్కొంటారు అని ఆయన తెలియజేసారు.ఈ కార్యక్రమం లో ఎఫ్పిఓ సీసీ సుదర్శన్, ప్రకృతి వ్యవసాయ సిబ్బంది, రైతులు పాల్గొన్నారు.