

కడప జిల్లా: బ్రహ్మంగారిమఠం: మన న్యూస్: మే 03: బ్రహ్మంగారిమఠం మండల అభివృద్ధి అధికారి కార్యాలయం నందు రెవెన్యూ డివిజనల్ అధికారి, A. చంద్రమోహన్ అధ్యక్షతన శుక్రవారం సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈనెల నాలుగో తేదీ నుండి 9వ తేదీ వరకు బ్రహ్మంగారిమఠం నందు జరగబోవు బ్రహ్మంగారి ఆరాధన ఉత్సవాలకు సంబంధించి భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అన్ని శాఖలకు చెందిన అధికారులు సమన్వయంతో పనిచేసి ఈ ఆరాధన ఉత్సవాలను దిగ్విజయం చేయాలని వారు అన్నారు. ఈ సమావేశంలో డీఎస్పీ, రాజేంద్రప్రసాద్ , డిపిఓ రాజ్యలక్ష్మి, డిఎల్డిఓ,బద్వేల్, శ్రీనివాసులు, అసిస్టెంట్ ప్రొహిబిషన్ & ఎక్సైజ్ సూపరిండెంట్ బి వినోద్ కుమార్, బ్రహ్మంగారిమఠం హిట్ పెర్సెంట్ శంకర్ బాలాజీ , అసిస్టెంట్ కమిషనర్ దేవాదాయశాఖ మల్లికార్జున ప్రసాద్, బ్రహ్మంగారిమఠం మండలం తాసిల్దార్ దామోదర్ రెడ్డి, బ్రహ్మంగారిమఠం మండలం ఎంపీడీవో వీర కిషోర్, మరియు అన్ని ప్రభుత్వ శాఖలకు సంబంధించిన కొందరు జిల్లా స్థాయి అధికారులు, డివిజన్ స్థాయి అధికారులు మరియు మండల స్థాయి అధికారులు పాల్గొనడం జరిగింది.