“మే డే” ప్రపంచ కార్మికుల పోరాట దినం – కార్మికుల జీవితాలపై గుదుబండగా ఉండే ప్రస్తుత కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నాలుగు లేబర్ కోడ్స్ రద్దు చేయాలి

Mana News, గాజువాక తే మే 1:- విశాఖపట్నం జిల్లా గాజువాక 67వ వార్డు సిపిఎం పార్టీ శాఖ మరియు సిఐటియు మరియు వివిధ ప్రజా ఉద్యమ సంఘాలు ప్రతినిధులు తో ప్రపంచ కార్మిక వర్గ చరిత్రను లిఖించిన దినముగా పిలవబడే మేడే సందర్భంగా..కామ్రేడ్ కే కిరీటం అధ్యక్షతన కామ్రేడ్ కేపీ కుమార్ గారు పర్యవేక్షితమైన కామ్రేడ్ సంతోషం గారు సూచనలతో ఈరోజు ఉదయం 6 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు వివిధ ప్రాంతాలలో వివిధ కార్మిక సంఘాలు కార్మికులతో సిఐటియు పతాకావిష్కరణ జరిగినట్లు శాఖా కార్యదర్శి కామ్రేడ్ లక్ష్మణస్వామి పాలూరు తెలియజేశారు. మొదటగా 67వ వార్డు జోగవాణిపాలెం సచివాలయం వద్ద జీవీఎంసీ మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికులు మస్తర్ పాయింట్ వద్ద “మే డే” జెండా సీనియర్ పారిశుద్ధ్య కార్మికుల చేతుల మీదుగా ఎగరవేయడం జరిగింది ఇక్కడ కార్యక్రమం ఉదయం 6 గంటల నుండి 7 గంటల వరకు సాగింది ఈ కార్యక్రమంలో జీవీఎంసీ వివిధ రకాల కార్మిక సంఘ నాయకులు మరియు కార్మికులు పాల్గొనడం జరిగింది. కొత్త గాజువాక బస్ స్టాప్ దగ్గర వివిధ ఫ్రూట్స్ మర్చంట్స్ మరియు కళాశీల ఆధ్వర్యంలో “మే డే” జెండా సీనియర్ “ఫ్రూట్స్ మర్చంట్” గొలుగు రామిరెడ్డి గారు చేతుల మీదుగా జెండా ఆవిష్కరణ జరిగింది. ఈ కార్యక్రమంలో ఫ్రూట్స్ మర్చంట్స్ చిన్న రెడ్డి గారు, శ్రీను గారు, గంగాధర గారు మరియు “మేస్త్రీలు” అప్పలనాయుడు గారు రాజారావు గారు నాగేశ్వరరావు గారు రమణగారు తదితరులతోపాటు కొన్ని పదుల మంది కళాసిలు పాల్గొనడం జరిగింది అంతేకాకుండా ఈ కార్యక్రమానికి శాఖ నాయకులతో పాటు గాజువాక జోన్ నాయకులు కామ్రేడ్ లోకేష్ గారు కామ్రేడ్ ఎల్ బంగారు నాయుడు గారు మొదలగువారు పాల్గొనడం జరిగింది. ఈ కార్యక్రమం 8 గంటల 30 నిమిషముల నుండి 10 గంటల వరకు ఉత్తేజపూరితమైన పాటలతో కార్యక్రమం జరిగింది. సాయిరాం నగర్ స్వామి విద్యానికేతన్ దరి ఉదయం 10:30 నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు 67వ వార్డు సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో గాజువాక జోన్ శాఖ సభ్యులు లోకేష్ మరియు బంగారు నాయుడు, పౌర హక్కుల సంఘం జిల్లా నాయకులు తుంపాల శ్రీరామ్ మూర్తి గారు, మధు మాస్టర్ గారు, అంబులెన్స్ యూనియన్ నాయకులు రాజయ్య, శాఖ ప్రతినిధులు కుమార్ గారు, కిరీటం గారు, సంతోషంగారు, గోవింద గారు, లక్ష్మణ స్వామి గారు మరియు ఆక్సిలరీ శాఖ సభ్యులు కృష్ణవేణి గారు, కళ్యాణి గారు ప్రాంత నాయకులు పాలూరు దేవి గారు మరియు వివిధ ప్రజా సంఘాల నాయకులు పాల్గొన్నట్లు శాఖా కార్యదర్శి కామ్రేడ్ లక్ష్మణ స్వామి పాలూరు గారు తెలిపారు. ప్రధానంగా ఎనిమిది గంటలు పని నిలబెట్టుకోవడం ఒక సవాల్ లేబర్ కోడ్లు అమలు కాకుండా అడ్డుకోవడం మరో సవాల్ ఈ రెండు సవాల్ వ్యతిరేకంగా పోరాడడానికి యావత్ కార్మిక వర్గం ఈ మేడే స్ఫూర్తితో ప్రతిని భూనాలని మరియు కార్మికులకు నష్టం కలుగజేసే చట్టాలను కష్టమైనా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ విధానాలను అడ్డుకోవాలి మరియు మే 20న జరిగే దేశవ్యాప్త సమ్మెను జయప్రదం చేయాలి అని సిఐటియు నాయకులు మాట్లాడినట్లు పి ఎల్ స్వామి గారు తెలిపారు .

Related Posts

ఎప్పుడు ఎన్నికలు పెట్టినా ఒన్ సైడ్ గా గెలిపించండి

సూపర్ సిక్స్ విజయోత్సవ వేదికగా ఆటో డ్రైవర్లకు  కానుక దసరాకు ఆటో డ్రైవర్లకు రూ.15వేల ఆర్ధిక సాయం చేస్తామని ప్రకటించిన సీఎం రప్పారప్పా అంటే చూస్తూ ఊరుకోమని హెచ్చరిక వైసీపీ నాయకుడిది దృతరాష్ట్ర కౌగిలి అని ఎద్దేవా చేసిన ముఖ్యమంత్రి  సీమ…

వాతావరణ మార్పుల ప్రభావం–ఆరోగ్య జాగ్రత్తలు తప్పనిసరి: శివ కిషోర్

ఉరవకొండ మన ధ్యాస: వజ్రకరూరు మండల కేంద్రంలోని స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో బుధవారం క్లైమేట్ కేర్ ఛాంపియన్స్ ప్రోగ్రాం (స్వస్తి ) బృందం తనిఖీ చేశారు. శివ కిషోర్ స్టేట్ ప్రోగ్రాం మేనేజర్, డాక్టర్ తన్మయి మేనేజర్ వేదిక అసోసియేట్…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed Mana News updates

దళితుల స్థలాలను ఆక్రమించిన వారిపై చర్యలు తీసుకోవాలి కొప్పాల రఘు…వివాదాస్పదమైన జి చెర్లోపల్లి గ్రామాన్ని సందర్శించిన డివిఎంసి సభ్యులు…///

  • By NAGARAJU
  • September 10, 2025
  • 3 views
దళితుల స్థలాలను ఆక్రమించిన వారిపై చర్యలు తీసుకోవాలి కొప్పాల రఘు…వివాదాస్పదమైన జి చెర్లోపల్లి గ్రామాన్ని సందర్శించిన డివిఎంసి సభ్యులు…///

అనంతపురంలో ఘనంగా “సూపర్ సిక్స్ సూపర్ హిట్” సభ..సూపర్ సిక్స్- సూపర్ హిట్ సభలో పాల్గొన్న ఎమ్మెల్యే కాకర్ల సురేష్…///

  • By NAGARAJU
  • September 10, 2025
  • 4 views
అనంతపురంలో ఘనంగా “సూపర్ సిక్స్  సూపర్ హిట్” సభ..సూపర్ సిక్స్- సూపర్ హిట్ సభలో పాల్గొన్న ఎమ్మెల్యే కాకర్ల సురేష్…///

ఎప్పుడు ఎన్నికలు పెట్టినా ఒన్ సైడ్ గా గెలిపించండి

ఎప్పుడు ఎన్నికలు పెట్టినా ఒన్ సైడ్ గా గెలిపించండి

ఎన్నికల్లో హామీలు ఇచ్చాం ఎన్ని కష్టాలు వచ్చినా తీర్చాం.

ఎన్నికల్లో హామీలు ఇచ్చాం ఎన్ని కష్టాలు వచ్చినా తీర్చాం.

వాతావరణ మార్పుల ప్రభావం–ఆరోగ్య జాగ్రత్తలు తప్పనిసరి: శివ కిషోర్

వాతావరణ మార్పుల ప్రభావం–ఆరోగ్య జాగ్రత్తలు తప్పనిసరి: శివ కిషోర్

ఉపరాష్ట్రపతి ఎన్నిక కేవలం వ్యక్తి ఎన్నిక కాదు

ఉపరాష్ట్రపతి ఎన్నిక కేవలం వ్యక్తి ఎన్నిక కాదు