

మన న్యూస్ బంగారుపాళ్యం ఏప్రిల్-29: పూతలపట్టు నియోజకవర్గం, బంగారుపాళ్యం మండలం, మొగిలి వెంకటగిరి గ్రామానికి చెందిన తెలుగుదేశం పార్టీ (టిడిపి) సీనియర్ నాయకుడు, మాజీ మండల ప్రధాన కార్యదర్శి చంద్రశేఖర్ (కవి) భౌతికకాయానికి పూతలపట్టు శాసనసభ్యులు మురళీమోహన్ నివాళ్ళు అర్పించారు. చంద్రశేఖర్ అనారోగ్యం కారణంగా చెన్నై అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ పరమపదించారన్న విషయం తెలుసుకుని మంగళవారం మధ్యాహ్నం మొగిలి వెంకటగిరి గ్రామానికి మండల నాయకులతో కలిసి చేరుకున్న పూతలపట్టు శాసనసభ్యులు డాక్టర్ కలికిరి మురళీమోహన్ చంద్రశేఖర్ భౌతికకాయానికి పూలమాల వేసి నివాళ్ళు అర్పించారు. అనంతరం ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించి ధైర్యం చెప్పారు. చంద్రశేఖర్ కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ, పార్టీ ఆయన కుటుంబానికి అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో చిత్తూరు జిల్లా ప్రధాన కార్యదర్శి కోదండ యాదవ్, క్లస్టర్ ఇంఛార్జ్ ఎన్.పి. ధరణీ నాయుడు మరియు మండల నాయకులు, కార్యకర్తలు పాల్గోన్నారు.
