భారత్‌తో సిమ్లా సహా అన్ని ద్వైపాక్షిక ఒప్పందాల తాత్కాలిక నిలిపివేత

మన న్యూస్ :- జమ్మూ కశ్మీర్‌లోని పహల్గామ్ ఉగ్రదాడి నేపథ్యంలో భారత్ తీసుకున్న కఠిన దౌత్యపరమైన చర్యలకు ప్రతిగా పాకిస్తాన్ కూడా తీవ్రంగా స్పందించింది. సిమ్లా ఒప్పందంతో సహా భారత్‌తో ఉన్న అన్ని ద్వైపాక్షిక ఒప్పందాలను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు గురువారం ప్రకటించింది.

పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ అధ్యక్షతన జరిగిన జాతీయ భద్రతా కమిటీ సమావేశం అనంతరం ఈ కీలక నిర్ణయాలు వెలువడ్డాయి.సింధూ నదీ జలాల ఒప్పందాన్ని భారత్ నిలిపివేయడాన్ని పాకిస్తాన్ తీవ్రంగా వ్యతిరేకించింది. ఒప్పందం ప్రకారం తమకు రావాల్సిన నీటి ప్రవాహాన్ని ఆపడానికి లేదా దారి మళ్లించడానికి ప్రయత్నిస్తే, దానిని ‘యుద్ధ చర్య’గా పరిగణిస్తామని పాక్ ప్రధాని కార్యాలయం విడుదల చేసిన ప్రకటనలో హెచ్చరించింది. తమ జాతీయ శక్తి సామర్థ్యాల మేరకు పూర్తిస్థాయిలో ప్రతిస్పందిస్తామని స్పష్టం చేసింది.అంతేకాకుండా, భారత్‌కు చెందిన లేదా భారత్ ద్వారా నడిచే అన్ని విమానాలకు తక్షణమే తమ గగనతలాన్ని మూసివేస్తున్నట్లు పాకిస్తాన్ ప్రకటించింది. భారత్‌తో అన్ని రకాల వాణిజ్యాన్ని, పాకిస్తాన్ మీదుగా ఇతర దేశాలకు జరిగే వాణిజ్యాన్ని కూడా తక్షణమే నిలిపివేస్తున్నట్లు తెలిపింది. భారత్ చర్యలకు బదులుగా వాఘా సరిహద్దు పోస్టును మూసివేయడంతో పాటు, ఇస్లామాబాద్‌లోని భారత హైకమిషన్‌లోని సిబ్బంది సంఖ్యను 30కి తగ్గించాలని, ఇక్కడి భారత రక్షణ శాఖ అధికారులను బహిష్కరించాలని కూడా పాకిస్తాన్ నిర్ణయించింది.నిన్న భారత్ తీసుకున్న చర్యలకు ప్రతిగానే పాకిస్తాన్ ఈ నిర్ణయాలు తీసుకుంది. సింధు జలాల ఒప్పందాన్ని నిలిపివేయడం, దౌత్య సంబంధాలను తగ్గించడం, పాక్ దౌత్యవేత్తలను, రక్షణ శాఖ అధికారులను బహిష్కరించడం, పాక్ పౌరులకు వీసాలు రద్దు చేసి 48 గంటల్లో దేశం విడిచి వెళ్లాలని ఆదేశించడం, అటారీ-వాఘా సరిహద్దును మూసివేయడం వంటి చర్యలను భారత్ చేపట్టిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో, పాకిస్తాన్‌లో ఉగ్రవాదాన్ని ప్రేరేపించడం, సరిహద్దుల ఆవల హత్యలు, అంతర్జాతీయ చట్టాలను, కాశ్మీర్‌పై ఐక్యరాజ్యసమితి తీర్మానాలను భారత్ పాటించడం లేదని ఆరోపిస్తూ, ఈ పరిస్థితులు చక్కబడే వరకు ఒప్పందాలను నిలిపివేస్తున్నట్లు పాకిస్తాన్ పేర్కొంది.

Related Posts

ఎప్పుడు ఎన్నికలు పెట్టినా ఒన్ సైడ్ గా గెలిపించండి

సూపర్ సిక్స్ విజయోత్సవ వేదికగా ఆటో డ్రైవర్లకు  కానుక దసరాకు ఆటో డ్రైవర్లకు రూ.15వేల ఆర్ధిక సాయం చేస్తామని ప్రకటించిన సీఎం రప్పారప్పా అంటే చూస్తూ ఊరుకోమని హెచ్చరిక వైసీపీ నాయకుడిది దృతరాష్ట్ర కౌగిలి అని ఎద్దేవా చేసిన ముఖ్యమంత్రి  సీమ…

వాతావరణ మార్పుల ప్రభావం–ఆరోగ్య జాగ్రత్తలు తప్పనిసరి: శివ కిషోర్

ఉరవకొండ మన ధ్యాస: వజ్రకరూరు మండల కేంద్రంలోని స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో బుధవారం క్లైమేట్ కేర్ ఛాంపియన్స్ ప్రోగ్రాం (స్వస్తి ) బృందం తనిఖీ చేశారు. శివ కిషోర్ స్టేట్ ప్రోగ్రాం మేనేజర్, డాక్టర్ తన్మయి మేనేజర్ వేదిక అసోసియేట్…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed Mana News updates

దళితుల స్థలాలను ఆక్రమించిన వారిపై చర్యలు తీసుకోవాలి కొప్పాల రఘు…వివాదాస్పదమైన జి చెర్లోపల్లి గ్రామాన్ని సందర్శించిన డివిఎంసి సభ్యులు…///

  • By NAGARAJU
  • September 10, 2025
  • 3 views
దళితుల స్థలాలను ఆక్రమించిన వారిపై చర్యలు తీసుకోవాలి కొప్పాల రఘు…వివాదాస్పదమైన జి చెర్లోపల్లి గ్రామాన్ని సందర్శించిన డివిఎంసి సభ్యులు…///

అనంతపురంలో ఘనంగా “సూపర్ సిక్స్ సూపర్ హిట్” సభ..సూపర్ సిక్స్- సూపర్ హిట్ సభలో పాల్గొన్న ఎమ్మెల్యే కాకర్ల సురేష్…///

  • By NAGARAJU
  • September 10, 2025
  • 4 views
అనంతపురంలో ఘనంగా “సూపర్ సిక్స్  సూపర్ హిట్” సభ..సూపర్ సిక్స్- సూపర్ హిట్ సభలో పాల్గొన్న ఎమ్మెల్యే కాకర్ల సురేష్…///

ఎప్పుడు ఎన్నికలు పెట్టినా ఒన్ సైడ్ గా గెలిపించండి

ఎప్పుడు ఎన్నికలు పెట్టినా ఒన్ సైడ్ గా గెలిపించండి

ఎన్నికల్లో హామీలు ఇచ్చాం ఎన్ని కష్టాలు వచ్చినా తీర్చాం.

ఎన్నికల్లో హామీలు ఇచ్చాం ఎన్ని కష్టాలు వచ్చినా తీర్చాం.

వాతావరణ మార్పుల ప్రభావం–ఆరోగ్య జాగ్రత్తలు తప్పనిసరి: శివ కిషోర్

వాతావరణ మార్పుల ప్రభావం–ఆరోగ్య జాగ్రత్తలు తప్పనిసరి: శివ కిషోర్

ఉపరాష్ట్రపతి ఎన్నిక కేవలం వ్యక్తి ఎన్నిక కాదు

ఉపరాష్ట్రపతి ఎన్నిక కేవలం వ్యక్తి ఎన్నిక కాదు