

మన న్యూస్ సింగరాయకొండ:-
గ్రామాల అభివృద్ధి సంక్షేమం గ్రామ సంపూర్ణ వికాసం సాధించాలంటే పంచాయితీ రాజ్ వ్యవస్థ బలోపేతం కావాలని దాని కొరకు గ్రామ పంచాయతీ, సచివాలయ సిబ్బంది అంకిత భావం తో పని చెయ్యాలని సింగరాయకొండ సర్పంచ్ తాటి పర్తి వనజ పిలుపు ఇచ్చారు.గురువారం సింగరాయకొండ గ్రామ పంచాయతీ సమావేశం మందిరం లో అధికారులు ఏర్పాటు చేసిన జాతీయ పంచాయతీ రాజ్ దినోత్సవం కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సర్పంచ్ తాటి పర్తి వనజ ముఖ్య అతిథిగా పాల్గొని ముందుగా గాంధీ పటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ముందుగా గ్రామ పంచాయతీ పంచాయతీ లో మైక్ తో దండోరా వేశారు. జాతీయ పంచాయతీ రాజ్ దినోత్సవం సందర్భంగా గ్రామ సభ ని కూడా ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో గ్రామ పంచాయతీ ప్రజాప్రతినిధులు,సచివాలయాల సిబ్బంది గ్రామ పంచాయతీ సిబ్బంది పాల్గొనాల్సి ఉంది.కారణాలు ఏమైనా జాతీయ పంచాయతీ రాజ్ దినోత్సవం మాత్రం క్యాలండర్ కార్యక్రమంగా జరిగింది అని చెప్పవచ్చు. పట్టుమని పది నిమిషాలు కూడా దినోత్సవం జరగలేదు. ఈ కార్యక్రమం లో పాల్గొన్న సర్పంచ్ వనజ మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలకు గ్రామ రాజ్యాన్ని అందుబాటు లో ఉంచేందుకు సచివాలయ వ్యవస్థను ప్రభుత్వం ఏర్పాటు చేసిందని అన్నారు. ప్రజలు రాజకీయ పార్టీలు, ఉద్యోగులు సిబ్బంది గ్రామ పంచాయతీ ప్రజా ప్రతినిధులు తమ బాధ్యతలం తాము నిర్వహించాలని అప్పుడే గ్రామ పంచాయతీ వ్యవస్థ బలోపేతం అయ్యేందుకు మార్గం సుగమం అవుతుందన్నారు. కార్యక్రమం అనంతరం
గ్రామ పంచాయతీ ప్రజాప్రతిధి పడిదపు రవి చొరవ తీసుకుని జాతీయ విషాదం కాశ్మీర్ లో ఉగ్రదాడుల చర్య తో మృతి చెందిన పర్యాటకుల మృతికి సంతాపం తెలిపారు. ఈసందర్భంగా గ్రామ పంచాయతీ ప్రజా ప్రతినిధులు పడితపు రవి, పాదర్తి కోటేశ్వర రావు, సచివాలయాల సిబ్బంది పాల్గొన్నారు.