

శంఖవరం మన న్యూస్ (అపురూప్): గ్రామీణ ప్రాంత విద్యార్థులు పోటీ పరీక్షలలో సత్తా చాటుతున్నారు. కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం శంఖవరం మండలం కత్తిపూడి కి చెందిన గౌతు పూర్ణ అఖిలేష్ నాగసాయి జేఈఈ మెయిన్స్ ఫలితాలలో సత్తా చాటి ఔరా అనిపించాడు. శుక్రవారం రాత్రి కేంద్ర విద్యాశాఖ ప్రకటించిన ఫలితాలలో ఈడబ్ల్యూఎస్ విభాగంలో 1911 ర్యాంకు తో 99 శాతం పైగా మార్కులు సాదించినట్లు విద్యార్థి తండ్రి గౌతు సత్యనారాయణ (బుజ్జి) తెలిపారు. సత్తా చాటిన విద్యార్థిని తల్లిదండ్రులతో పాటూ పెదనాన్న గౌతు నాగు (వైకాపా నేత) అభినందనలు తెలుపుతూ, వారి ఇంట్లో పండగ వాతావరణం నెలకొంది. నాగ సాయి ఇంటర్మీడియట్ (ఎంపీసీ) లో 957 మార్కులు సాధించి మంచి ప్రతిభ కనబరిచాడు. చదువులో పట్టుదల కృషి ఉంటే ఉన్నత శిఖరాలను అందుకోవచ్చని పలువురు అభినందించి కొనియాడారు. ఈ సందర్భంగా కత్తిపూడి గ్రామస్థులు అభినందనలు తెలిపారు.