జగతికి శాంతి సందేశాన్నిస్తూ క్రీస్తు శిలువ నేక్కిన రోజుసామాజిక కార్యకర్త లాయర్ కర్నే రవి

పినపాక, మన న్యూస్ : మణుగూరు సబ్ డివిజన్ ఏరియాలో గుడ్ ఫ్రైడే సందర్భంగా మణుగూరు ప్రాంత నివాసి సామాజిక కార్యకర్త లాయర్ కర్నే రవి క్రైస్తవ సోదరీ సోదరీమణులకు ఉపవాస దీక్షలు పురస్కరించుకొని పీవీ కాలనీ ఏరియాలో పాదయాత్ర చేస్తున్నటువంటి క్రైస్తవ సోదరీ సోదరీమణులకు 300 మందికి ఫ్రూట్ జ్యూస్ అందజేశారు. ఈ సందర్భంగా తాను మాట్లాడుతూ యోషయా గ్రంథం రచించబడిన 700 సంవత్సరాల తర్వాత యూదుల కులంలో కన్య,, యేసేపు లకు యేసు క్రీస్తు జన్మించాడు. యేసు జన్మ గురించి క్రొత్త నిబంధనలోని మత్తయి సువార్త 1:18-25, లూకా సువార్త 1:26 లో వ్రాయబడిఉంది. అయితే యేసు క్రీస్తు కాలానికి ఇశ్రాయేలు దేశం అంతా రోమన్స్ పరిపాలనలోకి వెళ్ళిపోయింది.బాల్యంనుండే ఆధ్యాత్మిక చింతన అలవర్చుకొన్న ఏసు క్రీస్తు సమాజంలో అణగద్రొక్కబడినవారిని అక్కున చేర్చుకొన్నాడు. సంఘ సంస్కర్తగా అప్పటి సమాజంలో మంచి మార్పు తీసుకురావడానికి ప్రయత్నించాడు, రాజ్యాంగం వంటి యూదుల పాత నిబంధన ధర్మశాస్త్రాన్ని సులభతరం చేసి క్రొత్త నిబంధనగా బోధించాడు. [యేసుక్రీస్తు] బోధనలకు పలు యూదులు, ఇతర జాతుల వారు ప్రభావితులయ్యారు. రోమా సామ్రాజ్యపు రాజులకు, యూదుల్లో మత చాందసులకు ఏసుక్రీస్తు బోధనలు నొప్పి కలిగించాయి. యూదుల్లో కొంతమంది మత చాదస్తులు యేసుక్రీస్తును దైవ ద్రోహిగా, దేశ ద్రోహిగా చిత్రీకరించి, చివరికి రోమా సామ్రాజ్యపు రాజులకు అప్పగించారు. యూదుల కోరిక ప్రకారం రోమన్ రాజు ఏసు క్రీస్తును అత్యంత కిరాతకంగా సిలువ వేయించారు. తర్వాత శిలువ కారణంగా మృతి చెందిన ఏసు క్రీస్తును దైవ కుమారుడని యూదులు, రోమన్స్ అంగీకరించారు. ఆనాటినుండి క్రైస్తవం అనే మార్గం వాడుకలోకి వచ్చింది. ప్రపంచమంతా విస్తరించసాగింది. క్రీస్తు సమాకాలిక శిష్యులు, భక్తులు క్రొత్త నిబంధన రచించారు.

Related Posts

హసన్‌పల్లి గ్రామంలో విద్యుత్ సమస్యకు శాశ్వత పరిష్కారం: మన ధ్యాస న్యూస్ కథనానికి స్పందన

మన ధ్యాస, నిజాంసాగర్ (జుక్కల్):మొహమ్మద్ నగర్ మండలంలోని హసన్‌పల్లి గ్రామంలో గత రెండు సంవత్సరాలుగా అధిక లోడు కారణంగా విద్యుత్ సరఫరాలో తీవ్రమైన సమస్యలు కొనసాగుతూ ఉండగా,మన ధ్యాస దినపత్రిక ఆదివారం ఒక కథనాన్ని ప్రచురించింది.ఇందులో ట్రాన్స్ఫార్మర్ కాలిపోయి వదిలివేయబడినట్లు, అందువల్ల…

ట్రాన్స్ఫార్మర్‌ పెట్టారు.. కాలిపోయింది వదిలేశారు..ఇది విద్యుత్ అధికారుల నిర్లక్ష్యం..

మన ధ్యాస, నిజాంసాగర్ (జుక్కల్):మొహమ్మద్ నగర్ మండలంలోని హసన్‌పల్లి గ్రామంలో గత రెండేళ్లుగా విద్యుత్ సమస్యలు తీవ్రరూపం దాల్చాయి. గ్రామంలోని మినీ ట్రాన్స్ఫార్మర్‌పై అధిక లోడు పడడం వల్ల తరచూ వైర్లు తెగిపడి కరెంటు సరఫరా నిలిచిపోతోంది.గ్రామస్థుల సమాచారం ప్రకారం,ఒకే ట్రాన్స్ఫార్మర్‌కు…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed Mana News updates

సురక్షత మైన డ్రైవింగ్ కుటుంబానికి భద్రత…

సురక్షత మైన డ్రైవింగ్ కుటుంబానికి భద్రత…

విద్యార్థుల సామర్థ్యాలకు అనుగుణం గానే బోధన…

విద్యార్థుల సామర్థ్యాలకు అనుగుణం గానే బోధన…

సిఫార్సు మోతాదులోనే రైతులు ఎరువుల వాడకం చేపట్టాలి..

సిఫార్సు మోతాదులోనే రైతులు ఎరువుల వాడకం చేపట్టాలి..

ప్రైవేటీకరణతో రాష్ట్ర భవిష్యత్తు ప్రమాదంలో: సిపిఐ

ప్రైవేటీకరణతో రాష్ట్ర భవిష్యత్తు ప్రమాదంలో: సిపిఐ

దళితుల స్థలాలను ఆక్రమించిన వారిపై చర్యలు తీసుకోవాలి కొప్పాల రఘు…వివాదాస్పదమైన జి చెర్లోపల్లి గ్రామాన్ని సందర్శించిన డివిఎంసి సభ్యులు…///

  • By NAGARAJU
  • September 10, 2025
  • 4 views
దళితుల స్థలాలను ఆక్రమించిన వారిపై చర్యలు తీసుకోవాలి కొప్పాల రఘు…వివాదాస్పదమైన జి చెర్లోపల్లి గ్రామాన్ని సందర్శించిన డివిఎంసి సభ్యులు…///

అనంతపురంలో ఘనంగా “సూపర్ సిక్స్ సూపర్ హిట్” సభ..సూపర్ సిక్స్- సూపర్ హిట్ సభలో పాల్గొన్న ఎమ్మెల్యే కాకర్ల సురేష్…///

  • By NAGARAJU
  • September 10, 2025
  • 5 views
అనంతపురంలో ఘనంగా “సూపర్ సిక్స్  సూపర్ హిట్” సభ..సూపర్ సిక్స్- సూపర్ హిట్ సభలో పాల్గొన్న ఎమ్మెల్యే కాకర్ల సురేష్…///