మన ధ్యాస, నిజాంసాగర్:( జుక్కల్ ) బోధన్ ,బాన్స్ వాడ ,కొత్త భాది,బొగ్గు గుడిసె చౌరస్తాకు రావాల్సిన సూపర్ లగ్జరీ బస్సు బైపాస్ రోడ్డు వెంట వెళ్లడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రతిరోజూ ఈ ప్రాంతం నుంచి హైదరాబాదుకు వందలాది మంది ప్రయాణికులు రాకపోకలు కొనసాగిస్తుంటారు.అయితే బస్సులు చౌరస్తాకు రాకపోవడంతో ప్రయాణికులు బైపాస్ రోడ్డు వరకు వెళ్లి బస్సులు ఎక్కాల్సిన పరిస్థితి ఏర్పడింది. ముఖ్యంగా రాత్రి సమయాల్లో మహిళలు, వృద్ధులు, విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
ఆర్టీసీ అధికారులు ఈ సమస్యపై పట్టించుకోవడం లేదని ప్రయాణికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొంతమంది డ్రైవర్లు ఇష్టారాజ్యంగా తమకు నచ్చిన విధంగా బస్సులను నడుపుతూ స్టాపులను దాటేస్తున్నారని ఆరోపిస్తున్నారు.అలాగే రాత్రి సమయంలో నిజాంసాగర్ బస్టాండ్‌కు రావాల్సిన కొన్ని బస్సులు అక్కడికి రాకుండా బాన్సువాడ, బోధన్ వైపు వెళ్లిపోతున్నాయని ప్రయాణికులు ఆరోపిస్తున్నారు. దీంతో రాత్రి వేళల్లో ప్రయాణికులు తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారు.
సంబంధిత అధికారులు స్పందించి బస్సులు మునుపటిలాగే నిర్ణీత మార్గంలో నడిచేలా చర్యలు తీసుకోవాలని ప్రయాణికులు కోరుతున్నారు.

By RAHEEM

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *