మన ధ్యాస , నెల్లూరు, ఫిబ్రవరి 13 : మూగ జీవాలను ప్రేమించండి, వాటిని కాపాడండి అని నెల్లూరు షెల్టర్ సొసైటీ ఫౌండర్ మహమ్మద్ నగ్మా సోనా పిలుపునిచ్చారు. నెల్లూరు ప్రెస్ క్లబ్ లో శుక్రవారం ఉదయం మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ…………గత ఏడు సంవత్సరాలుగా మూగజీవాలను రక్షిస్తూ….వాటికి ఆహారం మరియు శస్త్ర చికిత్స అవసరమైతే చేస్తున్నాను అని తెలిపారు. 2024 సంవత్సరంలో సంస్థని రిజిస్టర్ చేసుకున్నాము. ఈ సంస్థ ద్వారా కుక్కలు, పిల్లలు మొదలు జీవాలను స్నేహభావంతో ఆదుకొని వాటిని పోషిస్తూ వాటికి అవసరమైతే శస్త్ర చికిత్స లాంటి ఆరోగ్య సమస్యలు సంభవిస్తూ ఉంటే చేస్తూ కాపాడుతున్నాము అని తెలిపారు.మూగజీవాలను మా కుటుంబ సభ్యు లాగానే భావిస్తున్నాము. సృష్టిలో మనుషులు లాగే వాటికి జీవించే హక్కు ఉంది అని తెలిపారు.మూగజీవాల కోసం నేను బిఎస్సి కంప్యూటర్ చేసీ,ఐసిఐసిఐ కంపెనీలో 11 సంవత్సరాలు జాబ్ చేసి మానివేసి, 2015 నుండి ఈ కార్యక్రమంలో భాగంగా పనిచేస్తున్నాను. నష్టం మరియు కష్టం మానసిక శోభ ఉన్నప్పటికీ నా లక్ష్యం కోసం మూగజీవాల పట్ల ప్రేమ పెరిగిందా గాని తగ్గలేదు తగ్గదు అని అన్నారు.మనమంతా ఒక నిమిషం ఆలోచిద్దాం.. మూగ జీవాలు పట్ల మీరు కూడా దయ, జాలి కలిగి ఉండండి…హింస మరియు బాధ కలిగించవద్దు అని అన్నారు. నేను ముందుకు వచ్చాను మీరు కూడా ఒక అడుగు రండి, సమాజానికి తెలిసే విధంగా నెల్లూరు జంతువుల ప్రేమికుల సమావేశం అను ప్రోగ్రాను నెల్లూరు వి ఆర్ సి గ్రౌండ్ లో ఫిబ్రవరి 14 వ తేదీ శనివారం సాయంత్రం నాలుగు గంటల నుండి రాత్రి 8 గంటల వరకు నిర్వహిస్తున్నాము అని తెలిపారు.గ్రూప్ డిస్కషన్స్ డౌట్స్ జంతు ప్రేమికులకు గేమ్ (మ్యూజికల్ చైర్స్ ) నిర్వహిస్తున్నాము. గెలుపొందిన వారికి బహుమతులు,అతిథి సత్కారం చేయబడును అని తెలిపారు. కనుక జంతు ప్రేమికులు మా ఈ ప్రోగ్రామ్కు రావలసిందిగా కోరుచున్నాము అని తెలియజేశారు. ఇతర వివరాలు కోసం 87 12914870 ఫోన్ నెంబర్ కు సంప్రదించగలరు.
