మన ధ్యాస, నెల్లూరు, ఫిబ్రవరి 13 : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధిష్టానం మరియు ఏపీసీసీ అధ్యక్షురాలు పై, నెల్లూరు జిల్లా కాంగ్రెస్ నూతన అధ్యక్షుడు నారపరెడ్డి కిరణ్ కుమార్ రెడ్డి పై సోషల్ మీడియాలో అనుచిత వ్యాఖ్యలు బహిరంగంగా చేసిన కొండా అనిల్ ను కాంగ్రెస్ పార్టీ నుంచి బహిష్కరించడం జరిగిందని ఏపీసీసీ క్రమశిక్షణ సంఘం చైర్మన్ లింగం శెట్టి ఈశ్వరరావు ఉత్తర్వులు జారీ చేశారు. పార్టీ అధిష్టానం పై అనుచిత వ్యాఖ్యలు, పార్టీ వ్యతిరేక వ్యాఖ్యలు చేస్తున్నట్లు క్రమశిక్షణ సంఘం దృష్టికి వచ్చిందని, విచారణ చేయగా నిజమేనని నిర్ధారణ అయిందని తెలిపారు. గతంలో పలుమార్లు హెచ్చరించినా, షోకాజ్ నోటీసు జారీచేసిన, కొండా అనిల్ వైఖరిలో ఎలాంటి మార్పు రాలేదని, ఇటువంటి చర్యలను పార్టీ సహించబోదని అందుకే పార్టీ నుండి బహిష్కరించడం జరుగుతుందని తెలిపారు. రాబోయే రోజుల్లో పార్టీ కి వ్యతిరేకంగా పనిచేస్తున్న వారిపట్ల కఠినంగా వ్యవహరిస్తామని తెలిపారు.
