

మనన్యూస్,కామారెడ్డి టౌన్:జిల్లాలో జరుగుతున్న కల్తీ కళ్ళు వ్యవహారంపై చర్యలు తీసుకోవాలని,ప్రజలు ప్రాణాలు పోతున్న పట్టించుకోవడంలేదని జిల్లా ఎక్సైజ్ కార్యాలయంలో జాతీయ మానవ హక్కుల కమిటీ ఆధ్వర్యంలో ఎక్సైజ్ సూపర్ డెంట్ కు వినతి పత్రం అందజేశారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బాన్సువాడ,బీర్కూర్,గాంధారి ప్రాంతాల్లో ప్రజలు కల్తీ కల్లు బారిన పడితే ఎక్సైజ్ శాఖ ఎందుకు స్పందించడం లేదని ఆయన ప్రశ్నించారు.కామారెడ్డి జిల్లాలో విచ్చలవిడిగా జరుగుతున్న కల్తీకల్లు పై తక్షణమే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.అనంతరం కొత్త బస్టాండ్ సమీపంలో ఉన్న గణపతి ఆలయం లో కొంతమంది గుడిని మేమే కట్టించామంటూ గుడికి వచ్చే విరాళాలు,తమకే చెందాలంటూ గుడిలో ఉన్న పూజారి పై దౌర్జన్యం చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని కామారెడ్డి కలెక్టర్ ఏవోకు వినతి పత్రం అందజేశారు.ఈ కార్యక్రమంలో చైర్మన్ విజయ భాస్కరరావు,జాయింట్ సెక్రెటరీ కాటికం రాజు రెడ్డి,జిల్లా కన్వీనర్ రవీందర్ రెడ్డి,జిల్లా సోషల్ మీడియా కన్వీనర్ నారాయణ పాల్గొన్నారు.