

తిరుపతి రూరల్,నవంబర్ 16, (మన న్యూస్ )
తిరుపతి రూరల్ తిరుచానూరు పంచాయతీ దామినేడులో సుమారు లక్ష రూపాయల విలువైన వ్యవసాయ బోరు మోటారు కాపర్ వైరుని దొంగలు చోరీ చేశారు.సంబధిత బాధిత రైతు పి. సుబ్రహ్మణ్యం రెడ్డి గత కొంతకాలంగా అధిక వర్షాలు కురవడంతో వెళ్ళలేదు. శనివారం ఉదయం వెళ్లి చూడగా బోరుకు సంబంధించిన పి.వి.సి పైపులను కట్ చేసి విలువైన బోరు మోటారు, వైరు దొంగిలించడంతో దిక్కుతోచని స్థితిలో తిరుచానూరు పోలీసులకు పిర్యాదు చేసి, దొంగలు ఇదివరకు కూడా పలుమార్లు వైర్లు దొంగలించినట్లు తెలుపుతూ తగిన చర్యలు తీసుకోవాలని కోరారు,దీనిపై మీడియాతో బోరున విలపిస్తు న్యాయం చేయాలని ఆవేదన చెందారు.ఇప్పటికైనా పోలీసులు నిఘా పెట్టీ కాపర్ వైరు దొంగతనాలు అరికట్టాలని స్థానికులు పలువురు రైతులు కోరుతున్నారు.