

తవణంపల్లి నవంబర్ 15 మన న్యూస్
తవణంపల్లి మండలంలోని ఎంపీడీవో కార్యాలయం నందు గ్రామపంచాయతీ అభివృద్ధి ప్రణాళిక పై శిక్షణ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ శిక్షణ కార్యక్రమంలో భాగంగా మండలంలోని ఎంపీటీసీలు, సర్పంచులు, మండల స్థాయి అధికారులు, కార్యదర్శులు, డిజిటల్ అసిస్టెంట్లు, ఎస్ హెచ్ జి గ్రూప్ సభ్యులు ,వివోలు శిక్షణ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. శిక్షణ కార్యక్రమాన్ని ఉద్దేశించి తవణంపల్లి, ఎంపీడీవో రెడ్డి బాబు మాట్లాడుతూ గ్రామపంచాయతీలో అందుబాటులో ఉన్న వనరులను ఉపయోగించుకొని అన్ని వర్గాల ప్రజలకు ప్రయోజనాలు కలిగి పరిరక్షించబడే విధంగా ప్రణాళిక తయారు చేయడమే గ్రామపంచాయతీ అభివృద్ధి ప్రణాళిక అని తెలిపారు. ప్రణాళికలో భాగంగా బాలల సభ, మహిళల సభలు, నిర్వహించి అందులో సమస్యలను గుర్తించి పంచాయతీ పాలకవర్గ సభ్యులు, లైన్ డిపార్ట్మెంట్ అధికారులు, సాంకేతిక నిపుణులు, కలిసి ప్రజలందరి భాగస్వామ్యంతో ప్రణాళిక తయారు చేసి మొదటి గ్రామ సభలో సంకల్పం తీసుకొని, రెండవ గ్రామసభలో జిపిడిపి ప్రణాళిక ఆమోదంతో గ్రామ స్వరాజ్ పోర్టల్ నందు అప్లోడ్ చేయడంతో పక్రియ ముగిస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో జడ్పీ డిప్యూటీ సీఈవో జుబేద, ఎంపీపీ పట్నం ప్రతాప్ సుందరాయల్ రెడ్డి,ఎంపీటీసీలు, సర్పంచులు, పంచాయతీ కార్యదర్శులు, డిజిటల్ అసిస్టెంట్లు, పాల్గొన్నారు.