

మన న్యూస్: టాలెంటెడ్ రైటర్ సత్యదేవ్ జంగా నాని నటించిన శ్యామ్ సింగ రాయ్ సినిమాకు కథను అందించారు. ఏప్రిల్ 6న తన పుట్టినరోజు సందర్భంగా స్పెషల్ ఇంటర్వ్యూ…ఈ సందర్భంగా రైటర్ సత్యదేవ్ జంగా మాట్లాడుతూ…నేను ఏ ఫిలిం బై అరవింద్ సినిమా కథ రచయితగా పరిచయం అయ్యాను, ఆ సినిమా తరువాత ఆదిత్య మ్యూజిక్ కంపెనీలో సీనియర్ మేనేజర్ గా 20 ఏళ్ళు వర్క్ చేశాను. టాప్ సింగర్స్ తో 200 ప్రవేట్ ఆల్బమ్స్ చేశాను. సంగీత దర్శకుడు చక్రిని బాచి సినిమా ద్వారా సంగీత దర్శకుడిగా పరిచయం చేశాను, పూరి జగన్నాద్ తో నాకు ఉన్న పరిచయం తో చక్రిని ఎంకరేజ్ చెయ్యడం జరిగింది. అలా సినిమా ఇండస్ట్రీ తో పరిచయాలు బలపరుచుకొని, సాహిత్యం మీద మక్కువతో 2020లో ఆదిత్య మ్యూజిక్ నుండి బయటికి వచ్చి పూర్తిగా రచన వ్యాసంగం పై ఫోకస్ చేస్తూ… పునర్జర్మ బాక్డ్రాఫ్ లో పిరియడిక్ లవ్ స్టోరీతో ఒక కథను సిద్ధం చేసుకున్నాను. ఈ కథను దర్శకుడు రాహుల్ సాంకృతియన్ కు చెప్పడం జరిగింది తనకు ఈ కథ నచ్చి హీరో నానికి, సాయి పల్లవికి వినిపించడం జరిగింది. వారిద్దరికి ఈ కథ విపరీతంగా నచ్చడంతో శ్యామ్ సింగ రాయ్ చిత్రంగా రోపొంది ఘన విజయం సాధించింది. ఈ సినిమా రచయితగా నాకు గుర్తింపుతో పాటు పేరు ప్రఖ్యాతలు తెచ్చిపెట్టింది. హీరో వెంకటేష్ గారికి అల్లరి నరేష్ గారి కోసం అలాగే శ్రీ విష్ణు గారి కోసం కథలు సిద్ధం చేస్తున్నాను. వారి వే ఆఫ్ స్టైల్ లో స్టోరీస్ ఉండబోతున్నాయి, వారికి నా కథలు త్వరలో వినిపించబోతున్నాను. ప్రస్తుతం నేను ఎంఎల్ఏ , నేనే రాజు నేనే మంత్రి నిర్మాత భరత్ చౌదరి గారి కరణ్ సి ప్రొడక్షన్స్ లో ఆకెళ్ల వంశీ దర్శకత్వంలో ఒక థ్రిల్లర్ సినిమాకు కథ అందించబోతున్నాను. అన్ని రకాల జానర్స్ లో కథలు రెడీ చెయ్యడం జరిగింది, ఈ ఏడాది మంచి సినిమాలతో రాబోతున్నాను, సూపర్ నేచురల్, మైథలాజికల్ థ్రిల్లర్స్, హర్రర్ జానర్స్ తో పాటు ఔట్ అండ్ ఔట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్స్ జానర్స్ కథలు సిద్ధం చెయ్యడం జరిగింది, వాటి వివరాలు త్వరలో తెలియజేస్తాను అన్నారు.
