

ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సారధ్యంలో రాష్ట్రం అభివృద్ధి బాటలో పయనం శ్రీధర్ యాదవ్
మన న్యూస్ గంగాధర నెల్లూరు:-
గంగాధర నెల్లూరు మండలం నెల్లెపల్లి పంచాయతీ నెల్లేపల్లి గ్రామంలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీ చేసిన జిల్లా యాదవ సాధికార సమితి అధ్యక్షులు శ్రీధర్ యాదవ్. సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్టీఆర్ భరోసా పెన్షన్ ను వాలంటీర్లు లేకుండానే పెన్షన్ లబ్ధిదారులకు ఇంటి వద్దకే వెళ్లి పెన్షన్ ఇవ్వడంతో వారి సంతోషానికి అవధులు లేవని అన్నారు. రానున్న రోజుల్లో రాష్ట్రం అభివృద్ధి బాటలో నడిపి రాష్ట్రం రాష్ట్ర ప్రజలు సస్యశ్యామలంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, సారధ్యంలో అవుతుందని అన్నారు. అదేవిధంగా గంగాధర నెల్లూరు నియోజకవర్గ ఎమ్మెల్యే డాక్టర్ వి.ఎం థామస్ ఆధ్వర్యంలో గంగాధర నెల్లూరు నియోజకవర్గ దశ మారనుందని గంగాధర్ నెల్లూరు నియోజకవర్గం ఒక పరిశ్రమల హబ్బుగా త్వరలోనే అభివృద్ధి చెందుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ కమిటీ అధ్యక్షులు వెంకటేశ్ యాదవ్ పంచాయతీ కార్యదర్శి దుర్గ ప్రసాద్, వీఆర్వో లోకనాదం , వెల్ఫేర్ అసిస్టెంట్ హైమవతి, మహిళా పోలీస్ మౌనిక, హార్టికల్చర్ కవిత, ఇంజనీరింగ్ అసిస్టెంట్ సునీల్, డిజిటల్ అసిస్టెంట్ చిన్నబ్బ, పంచాయతీ సర్వేర్ మదు నాయకులు తదితరులు పాల్గొన్నారు.