మన న్యూస్,నిజాంసాగర్, జుక్కల్, డయల్ 100 కు ఫోను రాగానే సంఘటన స్థలానికి చేరుకొని బాధితులకు న్యాయం జరిగే విధంగా చూడాలని కామారెడ్డి జిల్లా ఎస్పీ రమేష్ చంద్ర అన్నారు.నిజాంసాగర్ మండల కేంద్రంలోని స్థానిక పోలీస్ స్టేషన్ ను అకస్మాకంగా సందర్శించి రికార్డులను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా పలు కేసులను సంబంధించిన వివరాలను ఎస్ఐ శివకుమార్ ను అడిగి తెలుసుకున్నారు. డైలీ హండ్రెడ్ ఫోన్ రాగానే సందర్శించి ఘటన స్థలానికి చేరుకొని బాధితులకు న్యాయం చేకూర్చాలని సూచించారు. రోడ్డు ప్రమాదాలు జరగకుండా ప్రజలకు ఇప్పటికప్పుడు అవగాహన కల్పిస్తూ నివారణ చర్యలు చేపట్టాలని తెలిపారు. గ్రామాలల్లో సిసి కెమెరాలు ఏర్పాటు చేసే విధంగా గ్రామాల్లోని ప్రజలకు అవగాహన కల్పించాలని అన్నారు. సైబర్ నేరాల బారిన పడకుండా ప్రజలను అప్రమత్తం చేయాలని అన్నారు.గంజాయి,ఇతర మత్తు పదార్థాలు,పేకాట జూదం తదితర వాటిపై ప్రత్యేకంగా నిఘా ఏర్పాటు చేసి ఉక్కుపాదం వెయ్యాలని పోలీసులకు ఆదేశించారు.ఈ కార్యక్రమంలో బాన్సువాడ డి.ఎస్.పి సత్యనారాయణ రూరల్ సీఐ రాజేష్,ఎస్ఐ శివకుమార్,హెడ్ కానిస్టేబుల్ సతీష్,వెంకటస్వామి,వసీ,శ్యామ్,రాజు,వీర భద్ర,రాకేష్ గౌడ్, ప్రవీణ్,గౌతమి, కస్తూరి,సంగమేశ్వర్,లక్ష్మణ్, తదితరులు పాల్గొన్నారు.

By RAHEEM

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *