మన ధ్యాస,నిజాంసాగర్,( జుక్కల్ )
నిజాంసాగర్ మండలంలోని పరిధిలోని 20 గేట్ల ప్రాంతం నుంచి ఆరేడు, మాన్ పల్లి, నిజాంపేట్ మీదుగా నారాయణఖేడ్ వెళ్లే ప్రధాన రహదారిపై నిన్న కురిసిన భారీ వర్షాలకు చెట్టు కూలి రోడ్డుపై పడింది. దీంతో ఈ మార్గంలో ప్రయాణించే ప్రజలు, రైతులు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
ఈ రహదారి నీటిపారుదల శాఖ ఆధీనంలో ఉండగా, చెట్టు కూలిన విషయం అధికారుల దృష్టికి వెళ్లినప్పటికీ ఇప్పటి వరకు తొలగించే చర్యలు చేపట్టలేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. నిన్న రాత్రి నుంచి రోడ్డుపై చెట్టు పడివున్నప్పటికీ అధికారులు స్పందించకుండా ఈరోజు శనివారం వరకు వేచి చూడడం పట్ల ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.ప్రతిరోజూ ఆరేడు, మాసంపల్లి, నిజాంపేట్, నారాయణఖేడ్ ప్రాంతాలకు వందలాది మంది ఈ రహదారిని ఉపయోగిస్తున్నారని, అత్యవసర పరిస్థితుల్లో కూడా రాకపోకలకు ఇబ్బందులు ఏర్పడుతున్నాయని గ్రామస్తులు తెలిపారు. ప్రమాదాలు జరిగే అవకాశం ఉన్నందున నీటిపారుదల శాఖ అధికారులు వెంటనే స్పందించి రోడ్డుపై పడిన చెట్టును తొలగించి రహదారిని పూర్తిస్థాయిలో అందుబాటులోకి తీసుకురావాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.
