జియ్యమ్మవలస /మనధ్యాస/ జూన్ 28 మండల పరిధిలోని జియ్యమ్మవలస ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆధ్వర్యంలో పల్స్ పోలియో కార్యక్రమాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా అలాగే ఘనంగా నిర్వహించారు. పిహెచ్‌సి వైద్యాధికారులు డాక్టర్ పి. జగదీష్, డాక్టర్ పి. సాయి ప్రసన్నల ప్రత్యక్ష పర్యవేక్షణలో ఈ వ్యాక్సినేషన్ ప్రక్రియ విజయవంతంగా సాగింది.ఈ సందర్భంగా వైద్యాధికారులు మాట్లాడుతూ, ఐదేళ్ల లోపు పిల్లలందరికీ తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించాలని, తద్వారా పోలియో రహిత సమాజ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. కార్యక్రమాన్ని పక్కా ప్రణాళికతో నిర్వహించడానికి వైద్య ఆరోగ్య శాఖ అన్ని ఏర్పాట్లు చేసింది. మండల వ్యాప్తంగా విస్తృతంగా సేవలందించేలా చర్యలు చేపట్టారు. మొత్తం లక్ష్యం 3,892 మంది పిల్లలు గాను వ్యాక్సిన్ వేయించుకున్న వారు 2,870 మంది పిల్లలు అనిడాక్టర్ సాయి ప్రసన్న తెలిపారు అలాగే 4 రూట్లు, 16 పోలియో బూత్‌లు, ఒక ట్రాన్సిట్ పాయింట్ అలాగే ఒక మొబైల్ టీమ్. సమాజంలో పోలియో మహమ్మారిని పూర్తిగా నిర్మూలించడమే ధ్యేయంగా ఈ బృహత్తర కార్యక్రమాన్ని చేపట్టాం. అర్హులైన పిల్లలందరికీ వ్యాక్సినేషన్ పూర్తి చేసేలా చర్యలు తీసుకున్నాం. పిహెచ్‌సి వైద్యాధికారులు తెలిపారుఈ కార్యక్రమంలో హెల్త్ విజిటర్స్ , హెల్త్ అసిస్టెంట్స్ , ఏఎన్ఎంలు , ఎంఎల్హెచ్‌పీలు ఫార్మసిస్ట్, ల్యాబ్ టెక్నీషియన్ ,ఆశా కార్యకర్తలు, సీహెచ్‌డబ్ల్యూలు ,అంగన్‌వాడీ సిబ్బంది వాలంటీర్లు పాల్గొన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *