మన ధ్యాస, మక్తల్: తెలంగాణ రాష్ట్ర మంత్రి డాక్టర్ వాకిటి శ్రీహరి గారి ఆదేశాల మేరకు.మక్తల్ మున్సిపాలిటీ పరిధిలోని,గోలపల్లి గ్రామ శివారులో 200 కోట్ల రూపాయల నిధులతో నిర్మిస్తున్న యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ పనులను రాష్ట్రస్థాయి కోఆర్డినేటర్ చంద్రసేనారెడ్డి, ఇంజనీరింగ్ అధికారులు రాము నిరంజన్ సత్యపాల్.. బుధవారం పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ,ఇంటిగ్రేటెడ్ స్కూల్ పనులను వీలైనంత వేగవంతంగా చేయాలని, సంవత్సరం కాలంలోపు పనులు పూర్తి చేసి ఇంటిగ్రేటెడ్ స్కూలును అందుబాటులోకి తీసుకురావాలని సూచించారు. వేలాది మంది విద్యార్థులు ఒకేచోట కార్పొరేట్ తరహాలో నాణ్యమైన విద్య ను అభ్యసించేలా సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో రాష్ట్ర ప్రభుత్వం యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ పాఠశాలలను ఏర్పాటు చేస్తొందని అన్నారు.వారితోపాటు కాంగ్రెస్ టౌన్ ప్రెసిడెంట్ అల్కూరి రవికుమార్, నిరంజన్ గౌడ్ ఉన్నారు.