అక్షింతలు వేసి చిన్నారులను ఆశీర్వదించిన ఎమ్మెల్యే కాకర్ల సురేష్..

నెల్లూరు జూన్ 28, మన న్యూస్ ప్రతినిధి నాగరాజు కె.

నెల్లూరు నగరంలో ఆర్.ఎస్.ఎన్ కన్వెన్షన్ హాల్ నందు సంధిరెడ్డి మహేష్ – శ్రీమతి అర్చన దంపతుల కుమార్తెలు చార్వి, ఐరా ల ఓణీల వేడుకలో ఉదయగిరి శాసనసభ్యులు కాకర్ల సురేష్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.ఈ సందర్భంగా చిన్నారులు చార్వి, ఐరా లకు అక్షింతలు వేసి, వారి భవిష్యత్తు ఆనందమయం, ఆయురారోగ్యాలతో, విద్యా విజ్ఞానాలతో ఉన్నత శిఖరాలను అధిరోహించాలని మనస్ఫూర్తిగా ఆశీర్వదించారు. కుటుంబ సభ్యులను ఆప్యాయంగా పలకరించి, ఈ శుభసందర్భం వారి కుటుంబానికి మరిన్ని సంతోషాలు, శ్రేయస్సు తీసుకురావాలని ఆకాంక్షించారు.అనంతరం మహేష్-అర్చన దంపతులు ఎమ్మెల్యే కాకర్ల సురేష్ కి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ వేడుకలో కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు, శ్రేయోభిలాషులు పెద్ద సంఖ్యలో పాల్గొని చిన్నారులకు శుభాకాంక్షలు తెలియజేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *