కొత్త రేషన్ కార్డుల కోసం తప్పని నిరీక్షణ..!

Mana News :- కొత్త రేషన్‌ కార్డుల కోసం తప్పని నిరీక్షణ, గణతంత్ర దినోత్సవం రోజున ఎంపిక చేసిన గ్రామాల్లో పంపిణీ, మిగతా గ్రామాల్లో దరఖాస్తుదారుల ఎదురుచూపులు, ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్‌ ముగిసినా ముందుకు సాగని ప్రక్రియ. మోర్తాడ్‌(బాల్కొండ):గణతంత్ర దినోత్సవాన ఎంపిక చేసిన గ్రామాల్లో రేషన్‌ కార్డులు పంపిణీ చేసి మురిపించారని, తరువాత ఆ ఊసే ఎత్తడం లేదని దరఖాస్తుదారులు అంటున్నారు. గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని జనవరి 26న జిల్లాలోని 31 గ్రామాల్లో 1066 కుటుంబాలకు కొత్త రేషన్‌ కార్డులు పంపిణీ చేశారు. అప్పటికే కొత్త కార్డుల కోసం జిల్లా వ్యాప్తంగా 81,148 మంది దరఖాస్తు చేసుకున్నారు. ఈ లెక్కన 80వేల మందికి పైగా దరఖాస్తుదారులు తమకు కార్డు ఎప్పుడొస్తుందనే ఎదురుచూస్తూనే ఉన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్‌ నేపథ్యంలో కొత్తకార్డుల పంపిణీకి బ్రేక్‌పడిందని కొన్నాళ్లపాటు చెప్పుకొచ్చినప్పటికీ.. ప్రస్తుతం కార్డులు అందజేసేందుకు ఏం అడ్డంకి ఉందని దరఖాస్తుదారులు ప్రశ్నిస్తున్నారు. ఏ సంక్షేమ పథకానికై నా ప్రభుత్వం రేషన్‌ కార్డునే ప్రామాణికం చేయడంతో నూతన కార్డులు జారీ చేయాలనే డిమాండ్‌ బలంగా వినిపిస్తోంది. మార్పులు, చేర్పులపై కనిపించని స్పందన :- రేషన్‌ కార్డుల్లో మార్పులు, చేర్పుల కోసం గత ఎనిమిదేళ్ల కాలంలో పలుమార్లు పౌర సరఫరాలశాఖ దరఖాస్తులు స్వీకరించినా ఎలాంటి ప్రయోజనం లేదు. కొత్తగా పెళ్లి చేసుకుని అత్తవారింటికి వచ్చిన వారి పేర్లను స్థానికంగా కార్డుల్లో చేర్చాల్సి ఉంది. అలాగే పిల్లల పేర్లనూ చే ర్చాల్సి ఉంది. ఇప్పటికే పలుమార్లు దరఖాస్తు చే సుకున్న వారు కార్డుల్లో పేర్లు నమోదుకాకపోవడంతో నిరాశకు గురవుతున్నారు. కొత్త కార్డుల జారీ లో జాప్యం, మార్పులు చేర్పుల అంశంపై ‘సాక్షి’ పౌర సరఫరాల శాఖ అధికారులను ఫోన్‌లో సంప్రదించగా తమకు ఎలాంటి సమాచారం లేదని వెల్లడించారు. ప్రభుత్వం నుంచి స్పష్టత వచ్చే వరకు తాము ఏమీ చెప్పలేమని సమాధానం ఇచ్చారు.

Related Posts

హసన్‌పల్లి గ్రామంలో విద్యుత్ సమస్యకు శాశ్వత పరిష్కారం: మన ధ్యాస న్యూస్ కథనానికి స్పందన

మన ధ్యాస, నిజాంసాగర్ (జుక్కల్):మొహమ్మద్ నగర్ మండలంలోని హసన్‌పల్లి గ్రామంలో గత రెండు సంవత్సరాలుగా అధిక లోడు కారణంగా విద్యుత్ సరఫరాలో తీవ్రమైన సమస్యలు కొనసాగుతూ ఉండగా,మన ధ్యాస దినపత్రిక ఆదివారం ఒక కథనాన్ని ప్రచురించింది.ఇందులో ట్రాన్స్ఫార్మర్ కాలిపోయి వదిలివేయబడినట్లు, అందువల్ల…

ట్రాన్స్ఫార్మర్‌ పెట్టారు.. కాలిపోయింది వదిలేశారు..ఇది విద్యుత్ అధికారుల నిర్లక్ష్యం..

మన ధ్యాస, నిజాంసాగర్ (జుక్కల్):మొహమ్మద్ నగర్ మండలంలోని హసన్‌పల్లి గ్రామంలో గత రెండేళ్లుగా విద్యుత్ సమస్యలు తీవ్రరూపం దాల్చాయి. గ్రామంలోని మినీ ట్రాన్స్ఫార్మర్‌పై అధిక లోడు పడడం వల్ల తరచూ వైర్లు తెగిపడి కరెంటు సరఫరా నిలిచిపోతోంది.గ్రామస్థుల సమాచారం ప్రకారం,ఒకే ట్రాన్స్ఫార్మర్‌కు…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed Mana News updates

సురక్షత మైన డ్రైవింగ్ కుటుంబానికి భద్రత…

సురక్షత మైన డ్రైవింగ్ కుటుంబానికి భద్రత…

విద్యార్థుల సామర్థ్యాలకు అనుగుణం గానే బోధన…

విద్యార్థుల సామర్థ్యాలకు అనుగుణం గానే బోధన…

సిఫార్సు మోతాదులోనే రైతులు ఎరువుల వాడకం చేపట్టాలి..

సిఫార్సు మోతాదులోనే రైతులు ఎరువుల వాడకం చేపట్టాలి..

ప్రైవేటీకరణతో రాష్ట్ర భవిష్యత్తు ప్రమాదంలో: సిపిఐ

ప్రైవేటీకరణతో రాష్ట్ర భవిష్యత్తు ప్రమాదంలో: సిపిఐ

దళితుల స్థలాలను ఆక్రమించిన వారిపై చర్యలు తీసుకోవాలి కొప్పాల రఘు…వివాదాస్పదమైన జి చెర్లోపల్లి గ్రామాన్ని సందర్శించిన డివిఎంసి సభ్యులు…///

  • By NAGARAJU
  • September 10, 2025
  • 4 views
దళితుల స్థలాలను ఆక్రమించిన వారిపై చర్యలు తీసుకోవాలి కొప్పాల రఘు…వివాదాస్పదమైన జి చెర్లోపల్లి గ్రామాన్ని సందర్శించిన డివిఎంసి సభ్యులు…///

అనంతపురంలో ఘనంగా “సూపర్ సిక్స్ సూపర్ హిట్” సభ..సూపర్ సిక్స్- సూపర్ హిట్ సభలో పాల్గొన్న ఎమ్మెల్యే కాకర్ల సురేష్…///

  • By NAGARAJU
  • September 10, 2025
  • 5 views
అనంతపురంలో ఘనంగా “సూపర్ సిక్స్  సూపర్ హిట్” సభ..సూపర్ సిక్స్- సూపర్ హిట్ సభలో పాల్గొన్న ఎమ్మెల్యే కాకర్ల సురేష్…///