మన ధ్యాస, నెల్లూరు, జూన్ 28 : నెల్లూరు నగరంలో స్థానిక మహేశ్వరి పరమేశ్వరి కళ్యాణ మండపంలో ఆదివారం గాండ్ల, తెలికుల విద్యార్థులకు ప్రతిభా పురస్కారాల కార్యక్రమం అఖిల గాండ్ల,తెలికుల సంక్షేమ సంఘం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రశాఖ మరియు నెల్లూరు జిల్లా అధ్యక్షులు గ్రోసు సుబ్బారావు అధ్యక్షన జరిగింది. ఈ కార్మక్రమంలో విశేష ప్రతిభ కనబరచిన విద్యార్థులకు నగదు ప్రోత్సాహకాలు, మెమొంటోలు,సర్టిఫికెట్స్ బహుమతిగా అందించడం జరిగింది. అదేవిధంగా అనుబంధంగా రాష్ట్ర శాఖ ఆధ్వర్యంలో గాండ్ల, తెలికులకు పెన్షనర్స్, ఎంప్లాయిస్ మరియు టీచర్స్ (పిఇటి), అనుబంధ విభాగాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. పీఇటి లోగోను కూడా ఆవిష్కరించారు. గాండ్ల, తెలికుల సంఘ ఆధ్వర్యంలో త్వరలో జరగబోవు శంఖారావం కార్యక్రమానకు గ్రోసు సుబ్బారావు కోటి రూపాయలు బూరి విరాశం ప్రకటించారు . రాష్ట్ర అధ్యక్షులు గ్రోసు సుబ్బారావు మాట్లాడుతూ…….. గాండ్ల, తెలికుల విద్యార్థులందరూ బాగా చదువుకుని, మంచి ఉద్యోగాలు సాధించాలని, విద్యతోనే సమగ్రాభివృద్ధి సాధించగలమని తెలియజేసారు. మన కులస్తులు, ఆర్థికంగా,సామాజిక, రాజకీయ, విద్యాపరంగా,ప్రగతి సాధనలో పెన్షనర్లు, ఎంప్లాయిస్, టీచర్లు భాగస్వాములు అవ్వాలనే ప్రయత్నంతో ఈ పిఇటి అనుబంధ విభాగాన్ని ఏర్పాటు చేస్తున్నామని తెలియచేసారు.ఈ కార్యక్రమంలో ఏ.జి. టి. ఎస్. ఎస్ జిల్లా ప్రధాన కారదర్శి తిరుపతి హరగోపాల్ , జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ వరికుంట్ల రాజా , జిల్లా కోశాధికారి సిరిగిరి సత్యనారాయణ, రాష్ట్ర స్టీరింగ్ కమిటీ పెద్దలు, రాష్ట్ర గౌరవ సలహాదారులు గిద్దలూరి ప్రభాకర్ రావు , అనంత్ , బుర్రా మధుసూధన్ , తిరుపతి. లీలా కృష్ణకుమార్, రాష్ట్ర స్పోరింగ్ కమిటీ సభ్యులు, జిల్లా శాఖల అధ్యక్షులు,ప్రధాన కార్యదర్శులు , పిఇటి విభాగం వివిధ జిల్లాల కన్వీనర్లు, కో – కన్వీనర్లు , కుల విద్యార్థులు, వారి తల్లిదండ్రులు విశేష సంఖ్యలో హాజరయ్యారు .








