

మనన్యూస్,నారాయణ పేట:కానిస్టేబుల్ పై దాడి చేసి వ్యక్తిని సోమవారం రిమాండ్ కి తరలించినట్లు ఊట్కూర్ ఎస్సై కృష్ణంరాజు తెలిపారు.ఈ సందర్భంగా ఎస్ఐ మాట్లాడుతూ,నారాయణపేట జిల్లా పరిధిలోని ఊట్కూర్ మండలం పోలీస్ స్టేషన్ పరిధిలో లోని ఐదవ తేదీన పెద్ద చెరువు నుండి అక్రమంగా ఇసుకను తరలిస్తున్న ట్రాక్టర్ ను కానిస్టేబుల్ పట్టుకోగా ట్రాక్టర్ యజమాని చాకలి శ్రీను కానిస్టేబుల్ పై దాడి చేసి తమ టాక్టర్ను తీసుకువెళ్లాడని,అట్టి వ్యక్తిపై కానిస్టేబుల్ ఫిర్యాదు ఇవ్వగా కేసు నమోదు చేసి రిమాండ్ కూ తరలించడం జరిగిందని తెలిపారు.
