విద్యార్థులు నైతిక విలువలను పెంపొందించుకోవాలి -విశ్వం పబ్లిక్ స్కూల్ కరస్పాండెంట్లు జయచంద్రారెడ్డి, చిట్టిబాబు

Mana News, చిత్తూరు, మార్చి 6 : విద్యార్థులు చిన్నతనంలోనే నైతిక విలువలను పెంపొందించుకోవాలని, అలా చేస్తేనే జీవితంలో ఎదుగుదల సాధ్యమవుతుందని విశ్వం పబ్లిక్ స్కూల్ కరస్పాండెంట్లు జయచంద్రారెడ్డి, చిట్టిబాబు వెల్లడించారు. ఈ మేరకు స్థానిక సాంబయ్యకండ్రిగలో ఏర్పాటు చేసిన విశ్వం పబ్లిక్ స్కూల్ 18 వ వార్షికోత్సవాన్ని గురువారం మధ్యాహ్నం స్థానిక నాగయ కళాక్షేత్రంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కరస్పాండెంట్లు మాట్లాడుతూ … క్రమశిక్షణతో విద్యను అభ్యసించి విద్యార్థులు ఉన్నత శిఖరాలు అధిరోహించాలని సూచించారు ముఖ్యంగా తల్లిదండ్రులను, గౌరవించడంతోపాటు నైతిక విలువలకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. అదే క్రమంలో చదువుల విషయంలో అశ్రద్ధ చేయరాదని సూచించారు. 19 సంవత్సరాల క్రితం 200 మంది విద్యార్థులుతో ప్రారంభమైన తమ పాఠశాలలో నేడు 900 మందితో విజయవంతంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. తమ పాఠశాలలోని అంకితభావం కలిగిన ఉపాధ్యాయులు, తల్లిదండ్రుల నమ్మకం, విద్యార్థుల కృషితో ప్రతి ఏటా పదవ తరగతి పరీక్ష ఫలితాల్లో ఉత్తమ ర్యాంకులు సాధిస్తున్నట్లు వివరించారు. ఈ కారణంగానే తమ పాఠశాలకు మంచి పేరు ప్రఖ్యాతలు వచ్చాయన్నారు. సువిశాల స్థలంలో, ప్రశాంత వాతావరణంలో నిర్మించిన తమ పాఠశాలలో విద్యకే కాకుండా క్రీడలు, సైన్స్ ఫెయిర్లు నిర్వహణ, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ఎల్సిడి ప్రొజెక్టర్ల ద్వారా విద్యాబోధన చేపడుతున్నట్లు పేర్కొన్నారు. ఎప్పటిలాగే ఇకపై సైతం తమను విద్యార్థుల తల్లిదండ్రులు ఆదరించాలని వారు కోరారు. కాగా ఈ కార్యక్రమంలో విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, పాఠశాల సిబ్బంది తదితరులు తదితరులు పాల్గొన్నారు.

Related Posts

ప్రైవేటీకరణతో రాష్ట్ర భవిష్యత్తు ప్రమాదంలో: సిపిఐ

-10 వైద్య కళాశాలల పీపీపీ కేటాయింపు దుర్మార్గం-విద్య, వైద్య రంగాల ప్రైవేటీకరణ తగదు-విలేకరుల సమావేశంలో సిపిఐ_ఆంధ్రప్రదేశ్_రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ ఉరవకొండ, మన ధ్యాస: చంద్రబాబు అధికారంలోకి వచ్చిన 15 నెలల వ్యవధిలో రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేట్‌కు…

ఎప్పుడు ఎన్నికలు పెట్టినా ఒన్ సైడ్ గా గెలిపించండి

సూపర్ సిక్స్ విజయోత్సవ వేదికగా ఆటో డ్రైవర్లకు  కానుక దసరాకు ఆటో డ్రైవర్లకు రూ.15వేల ఆర్ధిక సాయం చేస్తామని ప్రకటించిన సీఎం రప్పారప్పా అంటే చూస్తూ ఊరుకోమని హెచ్చరిక వైసీపీ నాయకుడిది దృతరాష్ట్ర కౌగిలి అని ఎద్దేవా చేసిన ముఖ్యమంత్రి  సీమ…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed Mana News updates

ప్రైవేటీకరణతో రాష్ట్ర భవిష్యత్తు ప్రమాదంలో: సిపిఐ

ప్రైవేటీకరణతో రాష్ట్ర భవిష్యత్తు ప్రమాదంలో: సిపిఐ

దళితుల స్థలాలను ఆక్రమించిన వారిపై చర్యలు తీసుకోవాలి కొప్పాల రఘు…వివాదాస్పదమైన జి చెర్లోపల్లి గ్రామాన్ని సందర్శించిన డివిఎంసి సభ్యులు…///

  • By NAGARAJU
  • September 10, 2025
  • 3 views
దళితుల స్థలాలను ఆక్రమించిన వారిపై చర్యలు తీసుకోవాలి కొప్పాల రఘు…వివాదాస్పదమైన జి చెర్లోపల్లి గ్రామాన్ని సందర్శించిన డివిఎంసి సభ్యులు…///

అనంతపురంలో ఘనంగా “సూపర్ సిక్స్ సూపర్ హిట్” సభ..సూపర్ సిక్స్- సూపర్ హిట్ సభలో పాల్గొన్న ఎమ్మెల్యే కాకర్ల సురేష్…///

  • By NAGARAJU
  • September 10, 2025
  • 4 views
అనంతపురంలో ఘనంగా “సూపర్ సిక్స్  సూపర్ హిట్” సభ..సూపర్ సిక్స్- సూపర్ హిట్ సభలో పాల్గొన్న ఎమ్మెల్యే కాకర్ల సురేష్…///

ఎప్పుడు ఎన్నికలు పెట్టినా ఒన్ సైడ్ గా గెలిపించండి

ఎప్పుడు ఎన్నికలు పెట్టినా ఒన్ సైడ్ గా గెలిపించండి

ఎన్నికల్లో హామీలు ఇచ్చాం ఎన్ని కష్టాలు వచ్చినా తీర్చాం.

ఎన్నికల్లో హామీలు ఇచ్చాం ఎన్ని కష్టాలు వచ్చినా తీర్చాం.

వాతావరణ మార్పుల ప్రభావం–ఆరోగ్య జాగ్రత్తలు తప్పనిసరి: శివ కిషోర్

వాతావరణ మార్పుల ప్రభావం–ఆరోగ్య జాగ్రత్తలు తప్పనిసరి: శివ కిషోర్