

Mana News, కుప్పం :- పిఈఎస్ మెడికల్ కళాశాల వ్యవస్థాపకులు దొరస్వామి నాయుడు మృతి తనను తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసిందని చిత్తూరు పార్లమెంటు సభ్యులు దగ్గుమళ్ళ ప్రసాదరావు అన్నారు. గురువారం బెంగళూరులో తుది శ్వాస విడిచిన స్వర్గీయ దొరస్వామి నాయుడు మృతి పట్ల చిత్తూరు ఎంపి దగ్గుమళ్ళ ప్రసాదరావు ఢిల్లీలో తన ప్రగాఢ సంతాపాన్ని వ్యక్తం చేశారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రాతినిధ్య వహిస్తున్న కుప్పంలో.., పి ఈ ఎస్ మెడికల్ కళాశాలను స్థాపించి, ఎందరో ఉజ్వల భవిష్యత్తుకు బాటలు వేశాడని దొరస్వామి నాయుడు సేవలను కొనియాడారు. ఆయన మృతి తీరని లోటని.., తమలాంటి వారందరికో దొరస్వామి నాయుడు స్ఫూర్తిగా నిలిచారని పేర్కొన్నారు. దొర స్వామి నాయుడు కుటుంబానికి తన ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నట్లు చిత్తూరు ఎంపి వెల్లడించారు. సామాజిక దృక్పథం కలిగిన దొరస్వామి నాయుడు సేవలను కుప్పం ప్రజలు ఎప్పటికీ మరువరని తెలిపారాయన.
