గిర్‌ అభయారణ్యంలో పర్యటించిన ప్రధాని మోదీ! 

Mana News :- ప్రధాని నరేంద్ర మోదీ సోమవారం ఉదయం గుజరాత్‌లోని గిర్‌ అభయారణ్యంలో పర్యటించారు. ఈ రోజు(మార్చ్‌ 3) ప్రపంచ వన్యప్రాణి దినోత్సం సందర్భంగా ఆయన ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ పర్యటన అనంతరం ప్రధాని జునాగఢలోని ససాన్‌లో జరిగే జాతీయ వన్యప్రాణి బోర్డు సమావేశంలో పాల్గొంటారు. గిర్‌ అభయారణ్యంలో పర్యటిస్తున్న క్రమంలో ప్రధాని మోదీ స్వయంగా కెమెరాతో అక్కడున్న సింహాలను ఫొటోలు తీయడం విశేషం. ప్రధాని మోదీకి వైల్డ్‌ లైఫ్‌ ఫొటోగ్రాఫీ అంటే ఇష్టం అనే విషయం తెలిసిందే. గతంలో పలు సందర్భాల్లో కూడా మోదీ కెమెరాతో వన్యప్రాణుల ఫొటోలు క్లిక్‌మనిపించారు.ప్రధాని మోదీ పర్యటన సందర్భంగా జునాగఢ్‌ జిల్లాలోని న్యూ పిపాలియా వద్ద 20.24 హెక్టార్లలో నేషనల్‌ రెఫరల్‌ సెంటర్‌ ఫర్‌ వైల్డ్‌ లైప్ హెల్త్‌ ను ఏర్పాటు చేస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. గుజరాత్‌లోని తొమ్మిది జిల్లాలోని 53 తాలుకాల్లో సుమారు 30 చదరపు కిలో మీటర్లలో సింహాల ఆవాసాలు ఉన్నాయి. దీన్ని ఆసియా సింహాల నేలగా కూడా పిలుస్తారు. ప్రధాని నరేంద్ర మోదీ గిర్‌ అభయారణ్య పర్యటన సందర్భంగా రాజ్యసభ ఎంపీ పరిమల్‌ నత్వానీ ఎక్స్‌ వేదికగా ఆసక్తికర పోస్ట్‌ చేశారు. భారతదేశ సింహం, గుజరాత్‌గర్వించదగ్గ కుమారుడు, ప్రధాని మోదీ ఆసియా సింహాల భూమిని సందర్శిస్తున్నారని రాసుకొచ్చారు.వరల్డ్‌ వైల్డ్‌ లైఫ్‌ డే సందర్భంగా ప్రధాని మోదీ గిర్‌ సందర్శన వన్యప్రాణుల సంరక్షణను మరింత పెంపొందిచే అవకాశం ఉంది. వన్యప్రాణుల సంరక్షణకు కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని ఈ సందర్భంగా వన్యప్రాణుల ప్రేమికులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

Related Posts

ఉపరాష్ట్రపతి ఎన్నిక కేవలం వ్యక్తి ఎన్నిక కాదు

ఉరవకొండ మన ధ్యాస: నిమ్న వర్గాల గౌరవానికి సంబంధించిన విషయం బలహీనవర్గాల విజయం అని తెలియజేసిన భారతీయ జనతా పార్టీ ఓబీసీ మోర్చా జిల్లా అధ్యక్షుడు యల్.నాగేంద్ర కుమార్ భారత రాజ్యాంగ పరిరక్షణ, ప్రజాస్వామ్యం, సామాజిక న్యాయం ఉప రాష్ట్రపతి బాధ్యతలలో…

సర్పంచుల్లో ఉత్తముడు. వ్యాసాపురం సీతారాముడు.

ఉరవకొండ, మన న్యూస్: మండల పరిధిలోని వ్యాసాపురం సర్పంచ్ సీతారాములు ఉత్తమ సర్పంచుగా ఎంపికైన సంగతి విధితమే. ఢిల్లీలో జరిగిన స్వాతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా ఆయనను ప్రత్యేకంగా ఆహ్వానించి షాలు ఒక అప్పి పూలమాలలు వేసి మెమొంటోను బహుకరించారు. సర్పంచు…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed Mana News updates

భారీ వర్షాలకు కుప్పకూలిన రేకుల ఇల్లు..బోరున విలపిస్తున్న బాధ్యులు..ఘటన స్థలాలను పరిశీలించిన మండల స్థాయి అధికారులు..!!

భారీ వర్షాలకు కుప్పకూలిన రేకుల ఇల్లు..బోరున విలపిస్తున్న బాధ్యులు..ఘటన స్థలాలను పరిశీలించిన మండల స్థాయి అధికారులు..!!

జిల్లా సచివాలయంలో పునరుద్ధరించిన వీడియో కాన్ఫరెన్స్ హాల్, కమాండ్ కంట్రోల్ రూమ్ ను ప్రారంభించిన జిల్లా కలెక్టర్

జిల్లా సచివాలయంలో పునరుద్ధరించిన వీడియో కాన్ఫరెన్స్ హాల్, కమాండ్ కంట్రోల్ రూమ్ ను ప్రారంభించిన జిల్లా కలెక్టర్

జగనన్న కాలనీలో పర్యటించిన కాకాణి పూజిత”

జగనన్న కాలనీలో పర్యటించిన కాకాణి పూజిత”

సోమరాజుపల్లి, టిపి నగర్ వరద బాధితులకు ఆహార పంపిణీ

  • By JALAIAH
  • October 29, 2025
  • 4 views
సోమరాజుపల్లి, టిపి నగర్ వరద బాధితులకు ఆహార పంపిణీ

అల్యూమినియం ఉత్పత్తిలోA1 ఆధారిత మిషన్ హీయరింగ్ మరియు విజన్ టెక్నాలజీలను పరిచయం చేసింది

అల్యూమినియం ఉత్పత్తిలోA1 ఆధారిత మిషన్ హీయరింగ్ మరియు విజన్ టెక్నాలజీలను పరిచయం చేసింది

వింజమూరు మండలంలో తుఫాన్ ప్రభావానికి నిండిన 17 చెరువులు..!

వింజమూరు మండలంలో తుఫాన్ ప్రభావానికి నిండిన 17 చెరువులు..!