‎ఎస్‌.టి.యు చిత్తూరు జిల్లా శాఖ – నూతన జిల్లా కార్యవర్గం ఎన్నిక

చిత్తూరు, మన ధ్యాస డిసెంబరు-7
‎ఈరోజు చిత్తూరు పట్టణంలోని విజయం విద్యాసంస్థల్లో జరిగిన ఎస్‌టియు 79వ వార్షిక కౌన్సిల్ సమావేశంలో చిత్తూరు జిల్లా శాఖ కొత్త కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. సమావేశంలో జరిగిన ఎన్నికల్లో జిల్లా శాఖ అధ్యక్షులుగా రెండవ సారి ఎన్‌.ఆర్‌. మదన్ మోహన్ రెడ్డి ఎన్నికయ్యారు. అలాగే జిల్లా ప్రధాన కార్యదర్శిగా ఇలియాస్ భాషా, ఆర్థిక కార్యదర్శిగా పురుషోత్తం, గౌరవ అధ్యక్షులుగా పీతాంబర రాజు బాధ్యతలు స్వీకరించారు. రాష్ట్ర కౌన్సిలర్లుగా గంటా మోహన్, పురుషోత్తం దేవరాజులు రెడ్డి, చంద్రన్, చంద్రశేఖర్ నాయుడు ఎంపికయ్యారు. జిల్లా అసోసియేట్ అధ్యక్షులుగా కమలాపతి, బొబ్బిలి రెడ్డి, అదనపు కార్యదర్శులుగా కిషోర్ కుమార్ రెడ్డి, సుల్తాన్లను ఎన్నుకున్నారు. జిల్లా ఉపాధ్యక్షులుగా రాజేష్ కుమార్ గణపతి, కోదండయ్య, కుమార్, సుబ్రహ్మణ్యం, రాజేష్ కుమార్ స్వామి రెడ్డి బాధ్యతలు స్వీకరించగా, జిల్లా మహిళా కన్వీనర్‌గా రాధా కుమారి ఎన్నికయ్యారు. ఎన్నికల ప్రక్రియను ఎన్నికల అధికారులు హరి ప్రసాద్ రెడ్డి, ఎన్నికల పరిశీలకులు బాల గంగిరెడ్డి పర్యవేక్షించారు. తరువాత నూతనంగా ఎన్నికైన సభ్యులందరూ “ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి నిబద్ధంగా పనిచేస్తాం” అని ప్రమాణం చేశారు. జిల్లా నాయకులు నూతన కార్యవర్గానికి అభినందనలు తెలిపారు.

Related Posts

పొర్లు కట్ట ప్రాంత వాసుల చిరకాల కోరిక నెరవేర్చిన రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పొంగూరు నారాయణ

మన ధ్యాస , నెల్లూరు ,డిసెంబర్ 7: నెల్లూరు నగరం ,48వ డివిజన్ ప్రజల చిరకాల కోరికను రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ నెరవేర్చారు.డివిజన్లో పర్యటించినప్పుడు స్థానిక ప్రజలు 40 ఏళ్లుగా ప్రహరీ గోడ ,…

క్రైస్తవ పండుగలో ఆరాధన ఉండాలి……పులగర శోభనబాబు

మన ధ్యాస ,తోటపల్లి గూడూరు , డిసెంబర్ 7:నెల్లూరు జిల్లా ,తోటపల్లి గూడూరు మండలం, కోడూరు బీచ్ దగ్గర లోని ముత్యాలతోపు గ్రామంలోని యేసు ప్రార్థన మందిరం నందు ఆదివారం జరిగిన ఆరాధన కూడిక లో ముఖ్య ప్రసంగీకులుగా పాస్టర్స్ పవర్…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed Mana News updates

పొర్లు కట్ట ప్రాంత వాసుల చిరకాల కోరిక నెరవేర్చిన రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పొంగూరు నారాయణ

పొర్లు కట్ట ప్రాంత వాసుల చిరకాల కోరిక నెరవేర్చిన రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పొంగూరు నారాయణ

క్రైస్తవ పండుగలో ఆరాధన ఉండాలి……పులగర శోభనబాబు

క్రైస్తవ పండుగలో ఆరాధన ఉండాలి……పులగర శోభనబాబు

నెల్లూరు రూరల్ లో పార్క్ నందు ఏర్పాటు చేస్తున్న సోలార్ లైట్స్ పనులు పర్యవేక్షించిన టిడిపి నాయకులు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి

నెల్లూరు రూరల్ లో పార్క్ నందు ఏర్పాటు చేస్తున్న సోలార్ లైట్స్ పనులు పర్యవేక్షించిన టిడిపి నాయకులు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి

అప్పన్న పరిస్థితి బాగోలేదంటేనే ఆరోజు సహాయం చేశా…… నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి

అప్పన్న పరిస్థితి బాగోలేదంటేనే ఆరోజు సహాయం చేశా…… నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి

ప్రజాసేవలో ఇద్దరూ….ఇద్దరే , వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి…. పొంగూరు నారాయణ

ప్రజాసేవలో ఇద్దరూ….ఇద్దరే , వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి…. పొంగూరు నారాయణ

శిశు మందిర్లో సప్త శక్తి సంగం అధిక సంఖ్యలో పాల్గొన్న మహిళలు

శిశు మందిర్లో సప్త శక్తి సంగం అధిక సంఖ్యలో పాల్గొన్న మహిళలు