చిత్తూరు, మన ధ్యాస డిసెంబరు-7
ఈరోజు చిత్తూరు పట్టణంలోని విజయం విద్యాసంస్థల్లో జరిగిన ఎస్‌టియు 79వ వార్షిక కౌన్సిల్ సమావేశంలో చిత్తూరు జిల్లా శాఖ కొత్త కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. సమావేశంలో జరిగిన ఎన్నికల్లో జిల్లా శాఖ అధ్యక్షులుగా రెండవ సారి ఎన్.ఆర్. మదన్ మోహన్ రెడ్డి ఎన్నికయ్యారు. అలాగే జిల్లా ప్రధాన కార్యదర్శిగా ఇలియాస్ భాషా, ఆర్థిక కార్యదర్శిగా పురుషోత్తం, గౌరవ అధ్యక్షులుగా పీతాంబర రాజు బాధ్యతలు స్వీకరించారు. రాష్ట్ర కౌన్సిలర్లుగా గంటా మోహన్, పురుషోత్తం దేవరాజులు రెడ్డి, చంద్రన్, చంద్రశేఖర్ నాయుడు ఎంపికయ్యారు. జిల్లా అసోసియేట్ అధ్యక్షులుగా కమలాపతి, బొబ్బిలి రెడ్డి, అదనపు కార్యదర్శులుగా కిషోర్ కుమార్ రెడ్డి, సుల్తాన్లను ఎన్నుకున్నారు. జిల్లా ఉపాధ్యక్షులుగా రాజేష్ కుమార్ గణపతి, కోదండయ్య, కుమార్, సుబ్రహ్మణ్యం, రాజేష్ కుమార్ స్వామి రెడ్డి బాధ్యతలు స్వీకరించగా, జిల్లా మహిళా కన్వీనర్‌గా రాధా కుమారి ఎన్నికయ్యారు. ఎన్నికల ప్రక్రియను ఎన్నికల అధికారులు హరి ప్రసాద్ రెడ్డి, ఎన్నికల పరిశీలకులు బాల గంగిరెడ్డి పర్యవేక్షించారు. తరువాత నూతనంగా ఎన్నికైన సభ్యులందరూ “ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి నిబద్ధంగా పనిచేస్తాం” అని ప్రమాణం చేశారు. జిల్లా నాయకులు నూతన కార్యవర్గానికి అభినందనలు తెలిపారు.







