మన ద్యాస ప్రతినిధి, సాలూరు : – మండలంలోని మామిడి పల్లి శ్రీ సరస్వతీ శిశు మందిర్లో కమిటీ సభ్యులు, ఆచార్యులు నిర్వహించిన సప్త శక్తి సంగం కార్యక్రమానికి విశేష స్పందన లభించింది. మహిళలు అధిక సంఖ్యలో పాల్గొని వక్తల సందేశాన్ని విని ఆనందాన్ని వ్యక్తం చేసారు. దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. ఆదివారం ఉదయం పాఠశాల అద్యక్షులు సువ్వాడ రామ కృష్ణ, ప్రధాన ఆచార్యులు వేముల గౌరి నాయుడుల ఆధ్వర్యంలో ఆదివారం సాయంత్రం పై కార్యక్రమాన్ని ఏర్పాటు చెయ్యగా మండలంలోని 12గ్రామల నుండి అధిక సంఖ్యలో మహిళలు పాల్గొన్నారు. వీరిని ఉద్దేశించి ముఖ్య అతిథి కేశి రెడ్డి స్వాతి, ముఖ్య వక్త అడ్వకేట్ పద్మావతి, డొంక అన్నపూర్ణ, కరణం రజనీ తదితరులు మాట్లాడారు. సమాజ నిర్మాణంలో మహిళల పాత్రే ప్రధానమైనదని, పూర్వం కుటుంబ వ్యవస్థ బలంగా ఉండేదని, కానీ నేడు అందుకు విరుద్ధంగా ఉందన్నారు. వ్యక్తుల మధ్య విభేదాలు, ఈర్ష్య, స్వార్థం పెరిగి కుటుంబ వ్యవస్థ చిన్నాభిన్నం అవుతోందన్నారు. దీనివల్ల సమాజంలో వింత పోకడలు ఏర్పడుతున్నాయన్నారు. మనదైన సంస్కృతి, సంప్రదాయాలు దెబ్బతింటూ, సనాతన ధర్మానికి నష్టం చేకూరు తొందన్నారు. కావున మహిళలు చైతన్య వంతం కావాలన్నారు. పిల్లలకు పెద్దల పట్ల గౌరవం, సమాజం పట్ల బాధ్యత, దేశం పట్ల ప్రేమ కలిగేలా మహిళలే చేయగలరన్నారు. చిన్నారులకు మొదటి గురువు తల్లి అన్న విషయాన్ని విస్మరించరాదన్నారు. కావున ముందు మనం మన కుటుంబం, సమాజం పట్ల బాధ్యతగా ఉంటూ మన పిల్లలకి వాటి గొప్పతనాన్ని, విలువలను తెలియ జెప్పాలన్నారు. అప్పుడే వారికి కుటుంబం, సమాజం పైన అభిమానం, ప్రేమ కలుగుతాయన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో కొంతమంది యువకులు సమాజం, బందువుల పట్ల బాధ్యత లేకుండా ఉంటున్నారని, చెడు సావాసాలకు అలవాటు పడుతున్నారని ఈ విషయాన్ని గుర్తించిన శ్రీ సరస్వతీ విద్యాపీఠం తన పరిధిలో ఉన్న శిశు మందిరాల ద్వారా మహిళలను సమాజం పట్ల చైతన్య వంతులను చేసేందుకు సప్త శక్తి సంగం పేరుతో సమ్మేళనాలు నిర్వహించటం జరుగుతోందన్నారు. అలాగే ఉమ్మడి కుటుంబాల ఆవశ్యకత గూర్చి, కుటుంబ సభ్యులు కలిసి కట్టుగా భోజనం చెయ్యటం, పెరట్లో కూరగాయలను పండించడం, ఇంటిలో నిత్య దీపారాధన చెయ్యడం వల్ల చేకూరే ప్రయోజనాలు వివరించారు. అదేవిదంగా శిశు మందిరాలు సమాజాన్ని ఉత్తేజ పరిచే ఇటువంటి కార్యక్రమాలు ఎప్పటికప్పుడు నిర్వహించాల్సిన అవసరం ఉందన్నారు. ఈ సందర్భంగా శిశుమందిర్ ఆచార్యుల కృషిని కొనియాడారు. క్రమశిక్షణతో కూడిన విద్య కోసం మన పిల్లలను శిశు మందిరాల్లో చేర్పించాలన్నారు. పాఠశాల కమిటీ సభ్యులు, ఆచార్యులు పాల్గొన్నారు.






