మన ధ్యాస ,నెల్లూరు, డిసెంబర్ 7:ఉదయం నుంచే దివ్యాంగులు ఆశతో, ఆనందంతో కనుపర్తిపాడు వద్ద గల విపిఆర్ కన్వెన్షన్ కు తరలి వచ్చారు. నడకే కష్టమైనా తమ జీవితాలకు విపిఆర్ ఫౌండేషన్ యిచ్చే ఎలక్ట్రిక్ ట్రై సైకిళ్లు బాసటగా నిలుస్తాయన్న ఆనందంతో దివ్యాంగులు ముఖాల్లో చిరునవ్వులు. జీవనోపాధి కోసం పోరాడుతున్న దివ్యాంగులకు ఉచితంగా బ్యాటరీ ట్రై సైకిళ్ల పంపిణీ కార్యక్రమానికి కనుపర్తిపాడు వద్ద గల విపిఆర్ కన్వెన్షన్ వేదిక అయింది. 90 మంది దివ్యాంగులకు ట్రై సైకిల్స్ అందించి విపిఆర్ ఫౌండేషన్ మరోసారి తన మానవతా విలువలను చాటుకుంది.విపిఆర్ ఫౌండేషన్ ద్వారా సేవా కార్యక్రమాలను విస్తృతం చేసి తమ సేవలు మరింత ఎక్కువ మందికి చేరువ చేయాలన్న ఉద్దేశంతోనే తాము రాజకీయాలలోకి వచ్చామన్నారు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి . కనుపర్తిపాడులోని విపిఆర్ కన్వెన్షన్ లో విపిఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఉచిత ట్రై సైకిళ్ళ పంపిణి కార్యక్రమంలో మంత్రి నారాయణ, ఎంపి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి తో కలిసి విపిఆర్ ఫౌండేషన్ ఛైర్ పర్సన్ హోదాలో ఆమె పాల్గొన్నారు. నెల్లూరు సిటీ పరిధిలోని 90 మందికి మంత్రి నారాయణ, ఎంపి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి తో కలిసి ఆమె దివ్యాంగులకు ట్రై సైకిళ్లు పంపిణి చేశారు. ఈ సందర్భంగా మంత్రి నారాయణ మాట్లాడుతూ…. వేమిరెడ్డి దంపతులు సంపాదన కోసం రాజకీయాల్లోకి రాలేదని ప్రజలకు సేవ చేయాలన్న లక్ష్యంతోనే రాజకీయాలలోకి వచ్చారన్నారు. ఆపదలో ఉన్న వారికి అండగా నిలుస్తున్న విపిఆర్ ఫౌండేషన్ సేవలను మంత్రి నారాయణ కొనియాడారు. అనంతరం జిల్లా టిడిపి అధ్యక్షులు అబ్దుల్ అజీజ్ మాట్లాడుతూ… విద్యా, వైద్యం మరియు ఆధ్యాత్మిక రంగాలలో వేమిరెడ్డి దంపతులు చేస్తున్న సేవలను ప్రశంసించారు. ప్రజా ప్రతినిధులు అన్న పదానికి సరికొత్త నిర్వచనం యిస్తూ ఎంపి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి ప్రజలకు చేరువై చేస్తున్న అభినందనీయం అన్నారు. నిస్వార్ధ సేవల ద్వారా రాజకీయాలలో సరికొత్త ఒరవడికి శ్రీకారం చుట్టిన వేమిరెడ్డి దంపతులు ఆదర్శప్రాయులన్నారు. అనంతరం ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి మాట్లాడుతూ…. నెల్లూరు సిటీలో నడక భారమైన 90 దివ్యాంగులకు ట్రై సైకిళ్ళు అందివ్వడం చాలా సంతోషంగా వుందన్నారు. నెల్లూరు సిటీ నియోజకవర్గంతో కలిపి ఇప్పటివరకు కోవూరు, ఉదయగిరి, కందుకూరు, ఆత్మకూరు, కావలి, నెల్లూరు రూరల్ లో 1,030 మందికి ట్రై సైకిల్స్ అందజేశామని తెలిపారు. కంటి చూపు లేక ఇబ్బందులు పడుతున్న వారికి మెరుగైన కంటి చూపు అందివ్వడం కోసం విపిఆర్ నేత్ర అనే సేవా కార్యక్రమానికి శ్రీకారం చుట్టినట్టు ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి వెల్లడించారు. ఉదయగిరి నియోజకవర్గం లో గత నెల నుంచి సాగుతున్న విపిఆర్ నేత్ర ద్వారా 5వేల 257ఉచితంగా కంటి పరీక్షలు చేసి 2 వేల 845 మందికి కంటి అద్దాలు అందించామన్నారు. చూసే కళ్ళకు వెలుగు… నడిచే కాళ్లకు బలం… తాగే గొంతుకు అమృతం” అన్నదే విపిఆర్ ఫౌండేషన్ నినాదామన్నారు. విపిఆర్ నేత్ర ద్వారా జిల్లా వ్యాప్తంగా ఉచిత కంటి పరీక్షలు చేసి కంటి అద్దాలు అందిస్తామన్నారు. 2016 విపిఆర్ అమృతధార తో ప్రారంభించిన విపిఆర్ ఫౌండేషన్ ద్వారా జిల్లా వ్యాప్తంగా 200 పై చిలుకు ఆర్ ఓ వాటర్ ప్లాంట్లు నెలకొల్పి ప్రజల దాహార్తి తీరుస్తున్నామన్నారు. ఎలక్ట్రిక్ ట్రై సైకిల్స్ కార్యక్రమాన్ని అన్ని నియోజకవర్గాలో విజయవంతం చేయడంలో సహకరించిన మంత్రులకు, ఎమ్మెల్యేలకు, కూటమి నాయకులు, కార్యకర్తలకు ఆమె ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. విపిఆర్ ఫౌండేషన్ ద్వారా రాజకీయాలకు అతీతమైన సేవా కార్యక్రమాలు చేసే తాము ప్రజలకు చేరువై మరింత మందికి సేవ చేయాలన్న సంకల్పంతోనే ప్రత్యక్ష రాజకీయాలలోకి వచ్చినట్టు ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి వెల్లడించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ బీదా రవిచంద్ర, బల్లి కళ్యాణ చక్రవర్తి, నుడా ఛైర్మెన్ కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి, మాజీ మున్సిపల్ చైర్ పర్సన్ తాళ్ళపాక అనురాధ తదితరులు పాల్గొన్నారు. .














