మన ధ్యాస ప్రతినిధి , సాలూరు డిసెంబర్ 7:- స్నేహమేరా జీవితం.. స్నేహమేరా శాశ్వతం. స్నేహం కంటే గొప్పబంధం మరేది లేదని 1987 సంవత్సరం పాచిపెంట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో చదువుకున్న పదవతరగతి బ్యాచ్ రుజువు చేసింది. ప్రతీ సంవత్సరం ఏదో ఒక దగ్గర వెన్యు ఏర్పాటు చేసుకొని అందరూ అక్కడ కలసి పాత జ్ఞాపకాలు గుర్తు చేసుకుని సందడి చేస్తారు. అందులో భాగంగానే ఆదివారం నాడు సాలూరు మండలం కురుకూటి పంచాయతీ దలాయివలస జలపాతం వద్ద కలుసుకొని సందడి చేశారు.నాటి మిత్రులులో దండి శ్రీనివారావు( వైయస్సార్ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి) మిగతా మిత్రులందరికీ వారి కుటుంబాలకు వసతి సౌకర్యాలు ఏర్పాటు చేశారు. నాటి జ్ఞాపకాలను గుర్తుకు తెచ్చుకుని చిప్పాడ వాసు ప్రకాష్, నల్లి గోవిందరావు,దండి శ్రీను, మద్ది థామస్, గ్రంధి ఉష, మరడ రమణమ్మ,అబ్దుల్ జలీల్, ఎస్ సూర్యనారాయణ, ఎం చంద్రినాయుడు,కే వల్లభరావు,కొమ్మాన లక్మణరావు, వై గౌరిశ్వరావు, పైల భీమయ్య, తదితరులు సందడి చేసారు. జలపాతం లో సరదాగా కేరింతలు కొట్టారు. ఆనందం తో మంచి ఫొటోలు తీసుకొని ఆట పాఠలుతో హ్యాపీ గా తిరిగారు. చుట్టుపక్కల కొండలు పర్యాటుకుల సందడి తో దళాయి వలసలో పిక్నిక్ సందడి నెలకొంది. మిత్రుల మధ్య స్నేహ సంబంధాలు మెరుగు పడాలంటే ఏడాది లో ఒక్కసారైనా ఆత్మీయ కలయిక ఏర్పాటు చేసుకుంటే రాబోయే తరాలకు స్నేహమంటే గౌరవం విలువ పెరుగుతుందని పలువురు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా పిక్నిక్ లో మిత్రులు వాసు ప్రకాష్, శ్రీను వాస్, గోవిందరావు,థామస్ , చంద్రి నాయుడు, గౌరీష్, మిగతా మిత్రులు కలయికను మరువలేకపోతున్నారు.






