 
									 
సరూర్ నగర్. మన ధ్యాస :- శృంగేరి పీఠాధిపతి శ్రీశ్రీశ్రీ విధుశేఖర భారతీ మహాస్వామి విజయ యాత్రలో భాగంగా ఆర్కే పురం డివిజన్ వాసవికాలనీ కొత్తపేటలో కొలువై ఉన్న అష్టలక్ష్మి సమేత శ్రీమన్నారాయణ స్వామి సాన్నిధ్యం అష్టలక్ష్మి దేవాలయానికి విచ్చేసి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం అన్నప్రసాద శాల మొదటి అంతస్తులో అమ్మవార్ల దర్శనానికి వచ్చిన భక్తులందరినీ అనుగ్రహింప చేశారు. స్వామి వారి అనుగ్రహ భాషణ కళ్యాణ మండపం ప్రాంగణములో జరిగింది. యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ హనుమంతరావు కుటుంబ సమేతంగా పాల్గొని పూజలు చేసారు. ఈ కార్యక్రమంలో దేవాలయం చైర్మన్ సోమా సురేష్ కుమార్, ఫౌండర్ చైర్మన్ గౌరిశెట్టి చంద్రశేఖర్, తేలుకుంట రమేష్ గుప్తా, ప్రధాన కార్యదర్శి గంప జగన్, కోశాధికారి అయిత అంజయ్య, కార్యదర్శి దాచేపల్లి శ్రీనివాస్ దేవాలయ కమిటీ సభ్యులు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు








