అత్యవసరమైతే తప్ప ఎవ్వరు బయటకి రాకండి…!
వింజమూరు అక్టోబర్ 21 :(మన ధ్యాస న్యూస్ )://
తుఫాను హెచ్చరికలు నేపథ్యంలో ఉదయగిరి నియోజకవర్గం లోని 8 మండలాలలో విస్తారం గా కురుస్తున్న వర్షాల పట్ల నియోజకవర్గం ప్రజలు అందరు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఉదయగిరి శాసనసభ్యులు విజ్ఞప్తి చేశారు.అత్యవసర సమయంలో తప్పితే ప్రజలు ఎవ్వరు బయటకి రావద్దని ఈ సందర్భంగా ఆయన కోరారు. విస్తారం గా కురుస్తున్న వర్షాలు తొ పాడి రైతులు, అన్నదాతలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.ప్రజలందరు దృఢమైన భవనాలలో ఉండాలని పెచ్చులూడి న స్లాబ్ లు ఇతర గుడిసెలు లోతట్టు ఉండవద్దు అన్నారు. ప్రజలు సురక్షిత ప్రాంతాలలో ఉండాలని తెలిపారు. అత్యవసర పరిస్థితుల్లో అధికారులకు, నాయకులకు సమాచారం అందించాలన్నారు. ఇబ్బందికర పరిస్థితుల్లో నాయకులు, కార్యకర్తలు ప్రజలకి అందుబాటులో ఉండాలని ఎమ్మెల్యే పిలుపునిచ్చారు. రెవిన్యూ,విద్యుత్, పోలీస్,అగ్నిమాపక సిబ్బంది, అప్రమత్తంగా ఉండాలని, ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని తెలిపారు.







