కలిగిరి, అక్టోబర్ 22 :మన ధ్యాస న్యూస్ ://
ప్రస్తుతం కురుస్తున్న వర్షాలకు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కలిగిరి సర్కిల్ సిఐ వెంకటనారాయణ కోరారు. మంగళవారం ఉదయం నుండి ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తున్న నేపథ్యంలో ప్రజలకు అధికారులు పలు సూచనలు చేశారు. బంగాళాఖాతం లో తీవ్ర వాయుగుండం ఏర్పడినట్లు వాతావరణ శాఖ హెచ్చరించిందని, దీనివల్ల భారీ వర్షాలు పడతాయన్నారు. ఈ నేపథ్యంలో ప్రజలు లోతట్టు ప్రాంతాల నుండి సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని, ఉధృతంగా ప్రవహిస్తున్న నదులు, వాగులు దాటే ప్రయత్నం చేయొద్దని కలిగిరి సర్కిల్ సిఐ వెంకటనారాయణకోరారు. అధికారులు లోతట్టు ప్రాంత ప్రజలను సురక్షితంగా తరలించేందుకు అన్ని విధాల ముందస్తు జాగ్రత్త ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు.







