కలిగిరి, అక్టోబర్ 20 : (మన ధ్యాస న్యూస్)://
కలిగిరి మండలం సిద్దనకొండూరు గ్రామానికి చెందిన వర్ధినేని జయరామయ్య అకాల మరణం పట్ల ఉదయగిరి శాసనసభ్యులు కాకర్ల సురేష్ తన ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. ముందుగా వర్ధినేని జయరామయ్య పార్థివదేహానికి కాకర్ల సురేష్ పూలమాల వేసి, నివాళులర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించి, ఈ అకస్మాత్తు దుఃఖ ఘటనలో ధైర్యంగా ఉండాలని ఆత్మీయంగా ప్రోత్సహించారు. కుటుంబ సభ్యుల మనోభావాలను తెలుసుకుని వారికి పూర్తి మద్దతు ఉంటుందని హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో మండల నాయకులు, పార్టీ కార్యకర్తలు, గ్రామ పెద్దలు, బంధుమిత్రులు మరియు గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని జయరామయ్య గారికి నివాళులు అర్పించారు.







