

గూడూరు, మన న్యూస్ :- ఘనంగా జాతీయ పతాక రూపశిల్పి పింగళి వెంకయ్య 149వ జయంతి వేడుక
జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల పాలచర్ల వారి పాలెం నందు జాతీయ పతాక రూపకర్త పింగళి వెంకయ్య 149వ జయంతిని ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసిన ఘనంగా నివాళులర్పించారు. 1876 ఆగస్టు 2న కృష్ణా జిల్లాలోని బట్ల పెనుమర్రు అనే గ్రామంలో జన్మించి, మన దేశానికి జాతీయ పతాకాన్ని రూపొందించిన తెలుగువాడు పింగళి వెంకయ్య గారిని, ఆయన సేవలను కొనియాడారు. ఆయన డైమండ్ వెంకయ్య అని, పత్తిలో అనేక రకాల కనుగొన్నందున పత్తి వెంకయ్య అని, జపాన్ దేశంలో అనేక పరిశోధన చేసినందున జపాన్ వెంకయ్య అని, గూడూరు గూడూరు ప్రాంత సమీపంలో మైకా ఖనిజంపై అనేక పరిశోధన చేశారని, మహాత్మా గాంధీ సూచన మేరకు జాతీయ పతాకాన్ని రూపొందించారని, నిస్వార్థ దేశభక్తుడైన పింగళి వెంకయ్య గారి సేవలను తెలుగు వారందరూ నిరంతరం స్మరించుకోవాలి అని ఈ మహనీయుని సేవలకు భారతరత్న ఇవ్వాలని ఈ సందర్భంగా తెలియజేశారు. విద్యార్థుల కు చిత్రలేఖన పోటీలు, సింగల్ వెంకయ్య గారి జీవితం పై ఉపన్యాస,వ్యాసరచన పోటీలు నిర్వహించి విజేతలకు బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో భారతీయ శిక్షణ మండల రాష్ట్ర కార్యవర్గ సభ్యులు దేశి రెడ్డి ప్రజేంద్ర రెడ్డి, పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు పి అనసూయ, చంద్రశేఖర్, లావణ్య, మాధవయ్య,లీల, సంధ్యారాణి నాగభూషణమ్మ, సుగుణ,రవీంద్ర, డి వెంకటరమణయ్య, తదితరులు పాల్గొన్నారు.
