

గూడూరు, మన న్యూస్ :- గూడూరు పట్టణం:- PM కిసాన్ – అన్నదాత సుఖీభవ పథకం కింద కూటమి ప్రభుత్వం నియోజకవర్గంలో అర్హులైన రైతులకు మంజూరు అయిన 14 కోట్ల 91 లక్షల రూపాయల చెక్కును అందించిన గూడూరు ఎమ్మెల్యే డాక్టర్ పాశిం సునీల్ కుమార్ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం చెప్పిన విధంగా సూపర్ 6 పథకాలలో ఒక్కోటి అమలు చేస్తుంది. మొన్న తల్లికి వందనం పథకం అమలు చేసాము, చెప్పిన మాట ప్రకారం ఎంత మంది చదువుతుంటే అంత మందికి 15 వేలు అందించాము. ఈ రోజు అన్నదాత సుఖీభవ పథకం కింద రైతుకు 20 వేలు అందిస్తామని చెప్పాము. మొదటి విడత లో భాగంగా 7000 వేల రూపాయలు ప్రతి రైతు ఖాతా లో ఈ రోజు జమ చేస్తున్నాం అని అన్నారు. PM కిసాన్ – అన్నదాత సుఖీభవ కింద గూడూరు మండలం లో 5188 మందికి గాను 3 కోట్ల 40 లక్షలు అందిస్తున్నాం చిల్లకూరు మండలం లో 4591 మందికి గాను 3 కోట్ల 12 లక్షలు అందిస్తున్నాం .కోట మండలం లో 3745 మందికి గాను 2 కోట్ల 51 లక్షలు అందిస్తున్నాం వాకాడు మండలంలో 3795 మందికి గాను 2 కోట్ల 51 లక్షలు అందిస్తున్నాం
చిట్టమూరు మండలం లో 4898 మందికి గాను 3 కోట్ల 37 లక్షలు అందిస్తున్నాం మొత్తం నియోజకవర్గం నందు 22217 మందికి గాను 14 కోట్ల 91 లక్షలు అందిస్తున్నాం అని అన్నారు. చెప్పున మాట ప్రకారం ఒక్కో పథకం అమలు చేస్తున్నాం అన్నారు. మాది మాటల ప్రభుత్వం కాదు చేతల ప్రభుత్వం అని అన్నారు.
