రైతు సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం – పెద్దగెడ్డ నీరు విడుదల చేసిన మంత్రి గుమ్మిడి సంధ్యారాణి

మన న్యూస్ పాచిపెంట, ఆగస్టు 2:- పార్వతిపురం మన్యం జిల్లా పాచిపెంట, గత ఐదేళ్లలో వైసీపీ ప్రభుత్వం విధ్వంస పాలన చేపట్టి ప్రజలను బ్రష్టు పట్టించిందని కారణంగా రాష్ట్రం ఆర్థికంగా వెనుకబడిందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడపడానికి అహర్నిశలు కృషి చేస్తున్నారని గిరిజన శాఖ,స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి తెలియజేశారు. శనివారం నాడు సాయంత్రం పాచిపెంట పెద్ద గెడ్డ జలాశయం నుంచి సాగు నీరు విడుదల చేశారు. దీని ద్వారా 12 వేల ఎకరాలు పంటలు పండుతాయని తెలిపారు. పాచిపెంట,సాలూరు,రామభద్రపురం మండలాల రైతులు నీటిని సద్వినియోగం చేసుకుంటున్నారని వెల్లడించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పెద్ద గెడ్డ జలాశయం సంబంధించి ఇంకేమైనా సమస్యలు ఉంటే సంబంధిత ఎగ్జిక్యూటివ్ ఇంజనీరు తో సమావేశమై ప్రతిపాదనలు తనకు ఇవ్వాలని వాటిని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు దృష్టికి తీసుకెళ్లి మంజూరు చేయించుకొస్తానని తెలిపారు. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎన్నికల్లో ఇచ్చిన హామీలు పక్కాగా అమలు చేస్తున్నారని అన్నదాత సుఖీభవ రైతుల ఖాతాల్లో ఏడు వేల రూపాయలు జమ అయ్యాయని మరో రెండు దపాలుగా 13 వేల రూపాయలు జమవుతాయని తెలిపారు. పెద్ద గెడ్డ, వెంగళరాయ,ఆండ్ర జలాశయాల్లో గతంలో అభివృద్ధి జరగలేదని రానున్న రోజుల్లో పూర్తిస్థాయిలో అభివృద్ధి చేర్పిస్తామని తెలిపారు. పెద్ద గెడ్డ జలాశయాన్ని పర్యాటక కేంద్రంగా చేయడానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆలోచిస్తున్నారని తెలిపారు. గత ప్రభుత్వం విధ్వంస పాలన కారణంగా అభివృద్ధి జరగలేదని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్ని రకాలుగా రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తున్నారని కొనియాడారు. రైతులను అన్ని విధాలుగా అభివృద్ధి చేయడమే ప్రభుత్వ ద్యేయమని ఆమె పేర్కొన్నారు. అరకు రహదారి నిర్మాణం పూర్తి చేయిస్తానని హామీ ఇచ్చారు. డోలీలుమోత లేకుండా రహదారులు నిర్మిస్తామని హామీ ఇచ్చారు. సరాయి వలస ఆశ్రమ పాఠశాల అభివృద్ధి నిమిత్తం నాలుగు కోట్ల 75 లక్షల రూపాయలు ప్రభుత్వం మంజూరు చేసిందని తెలిపారు. పాచిపెంట ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని కమ్యూనిటీ హెల్త్ సెంటర్ గా మార్పు చేయిస్తానని హామీ ఇచ్చారు. గిరిజన గ్రామాల్లో తాగునీటి సమస్య లేకుండా పూర్తిస్థాయిలో త్రాగునీరు అందించే విధంగా కృషి చేస్తానన్నారు. దేశంలో ఎక్కడా ఏ రాష్ట్రంలో లేని విధంగా 4000 రూపాయలు పెన్షన్ అందిస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కు లబ్ధిదారులంతా రుణపడి ఉంటారన్నారు. రాష్ట్రంలో లక్ష పెన్షన్లు, సాలూరు నియోజకవర్గం కి 470 కొత్త పెన్షన్లు మంజూరు అయ్యాయని పాచిపెంట మండలానికి 118 పెన్షన్లు మంజూరయ్యాయని తెలిపారు. సూపర్ సిక్స్ ద్వారా ఉచిత బస్సు,అన్నదాత సుఖీభవ,పెన్షన్, తల్లికి వందనం తదితర పథకాలు అమలు చేయడం జరిగిందని తెలిపారు. వచ్చే ఆగస్టు 15వ తేదీ నాడు పాచిపెంట మండలంలో 1000 ఎకరాలు గిరిజన రైతులకు పోడు పట్టాలు అందిస్తామని తెలిపారు. ఇంకా మీకు ఏమైనా సమస్యలు ఉంటే ఎటువంటి బిడియం లేకుండా ప్రజా దర్బార్ కు వచ్చి మీ సమస్యలు చెబితే పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. స్థానిక ఎన్నికల్లో భారీ విజయం సాదించాలి:- రానున్న స్థానిక ఎన్నికల్లో నియోజకవర్గంలో గల అన్ని సర్పంచ్ స్థానాలను మనము గెలిపించుకోవాలని అలాగైతే పూర్తిస్థాయిలో అభివృద్ధి జరుగుతుందని మంత్రి సంధ్యారాణి కార్యకర్తలకు, నాయకులకు, అభిమానులకు, ప్రజలకు పిలుపునిచ్చారు. ప్రస్తుతం సర్పంచులు ప్రభుత్వానికి సహకరించడం లేదని వారంతా మా కోసం సహకరించమని చెప్పలేదు కదా ప్రజా సంక్షేమం కోసం అభివృద్ధి కోసం సహకరించమంటే సహకరించకపోవడం ఎంతవరకు సమంజసం అని ఆమె ప్రశ్నించారు. అందుకే వచ్చే ఎన్నికల్లో సర్పంచులని గెలిపించుకున్నట్లయితే అభివృద్ధి సాధ్యపడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. నీరు విడుదల కార్యక్రమానికి పాచిపెంట మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు యుగంధర్, ఏఎంసీ చైర్మన్ ముఖి సూర్యనారాయణ, పెద్దగెడ్డ నీటి సంఘం అధ్యక్షు ప్రతినిధిఉండ్రోతు గంగరాజు, సీనియర్ నాయకులు మతల బలరాం, మండల తెలుగుదేశం పార్టీ యూత్ అధ్యక్షులు చల్లా కనక బాబు, తదితర ప్రజాప్రతినిధులు ఇంజనీరింగ్ అధికారులు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అభిమానులు తదితరులు పాల్గొన్నారు.

Related Posts

సురక్షత మైన డ్రైవింగ్ కుటుంబానికి భద్రత…

శంఖవరం/ అన్నవరం మన ధ్యాస ప్రతినిధి (అపురూప్):-జాతీయ రహదారి పై ప్రమాదాలను నివారించేందుకు భారీ కసరత్తు చేపడుతున్నారు.శ్రీ కాకినాడ జిల్లా ఎస్పీ జి బిందు మాధవ్ ఐపీఎస్ సూచనల మేరకు మరియు పెద్దాపురం డి.ఎస్.పి డి శ్రీహరి రాజు ఆదేశాలతో ప్రత్తిపాడు…

విద్యార్థుల సామర్థ్యాలకు అనుగుణం గానే బోధన…

శంఖవరం మన ధ్యాస ప్రతినిధి (అపురూప్):- విద్యార్థుల సామర్థ్యాలకు అనుగుణంగా బోధన జరగాలని ఉపాధ్యాయులకు సమగ్ర శిక్ష (కెజిబివి) కార్యదర్శి డి దేవానందరెడ్డి సూచించారు. కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం మండల కేంద్రం శంఖవరం కస్తూర్భా గాంధీ బాలికా విద్యాలయ (కెజిబివి)…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed Mana News updates

సురక్షత మైన డ్రైవింగ్ కుటుంబానికి భద్రత…

సురక్షత మైన డ్రైవింగ్ కుటుంబానికి భద్రత…

విద్యార్థుల సామర్థ్యాలకు అనుగుణం గానే బోధన…

విద్యార్థుల సామర్థ్యాలకు అనుగుణం గానే బోధన…

సిఫార్సు మోతాదులోనే రైతులు ఎరువుల వాడకం చేపట్టాలి..

సిఫార్సు మోతాదులోనే రైతులు ఎరువుల వాడకం చేపట్టాలి..

ప్రైవేటీకరణతో రాష్ట్ర భవిష్యత్తు ప్రమాదంలో: సిపిఐ

ప్రైవేటీకరణతో రాష్ట్ర భవిష్యత్తు ప్రమాదంలో: సిపిఐ

దళితుల స్థలాలను ఆక్రమించిన వారిపై చర్యలు తీసుకోవాలి కొప్పాల రఘు…వివాదాస్పదమైన జి చెర్లోపల్లి గ్రామాన్ని సందర్శించిన డివిఎంసి సభ్యులు…///

  • By NAGARAJU
  • September 10, 2025
  • 4 views
దళితుల స్థలాలను ఆక్రమించిన వారిపై చర్యలు తీసుకోవాలి కొప్పాల రఘు…వివాదాస్పదమైన జి చెర్లోపల్లి గ్రామాన్ని సందర్శించిన డివిఎంసి సభ్యులు…///

అనంతపురంలో ఘనంగా “సూపర్ సిక్స్ సూపర్ హిట్” సభ..సూపర్ సిక్స్- సూపర్ హిట్ సభలో పాల్గొన్న ఎమ్మెల్యే కాకర్ల సురేష్…///

  • By NAGARAJU
  • September 10, 2025
  • 5 views
అనంతపురంలో ఘనంగా “సూపర్ సిక్స్  సూపర్ హిట్” సభ..సూపర్ సిక్స్- సూపర్ హిట్ సభలో పాల్గొన్న ఎమ్మెల్యే కాకర్ల సురేష్…///