

దుత్తలూరు,(మనన్యూస్,ప్రతినిధి,నాగరాజు):
ఈనెల 31వ తేదీన నెల్లూరు లోని డాక్టర్ అంబేద్కర్ భవన్ లో జరగనున్న దళితుల ఆత్మరక్షణ, ఆత్మ గౌరవ రాజ్యాధికారం సాధన పోరాట సదస్సు ను విజయవంతం చేయాలని దళిత బహుజన పార్టీ జిల్లా ఇంచార్జ్ ఎమ్ రామచంద్ర పిలుపు నిచ్చారు. ఈ సందర్భంగా ఈ నెల 31 వ తేదిన మధ్యాహ్నం 3 గంటలకు అంబేద్కర్ భవన్ లో సదస్సు జరుగుతుందని, అనంతరం నగరం లో పాదయాత్ర
నిర్వహించడం జరుగుతుందని అన్నారు . అదేవిధంగా ఈ కార్యక్రమానికి దళిత బహుజన పార్టీ జాతీయ అధ్యక్షులు సుప్రీం కోర్ట్ న్యాయవాది వడ్లమూరి కృష్ణ స్వరూప్ ముఖ్య అతిధి గా వస్తున్నారని అన్నారు. అలాగే మాలమహానాడు జాతీయ కమిటీ అధ్యక్షులు ప్రొఫెసర్ డాక్టర్ వి ఎల్ రాజు ప్రధాన వక్త గా పాల్గొంటారని తెలిపారు. మరియు
దళిత బహుజన పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాఖ అధ్యక్షురాలు దాసరి అన్నపూర్ణ హాజరవుతారని, దళిత ఉద్యమం నాయకులు, డాక్టర్ అంబేద్కర్ వాదులు, అణగారిన బాధితుల సమాజం అంతా ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున తరలి రావాలని పార్టీ జిల్లా ఇంచార్జ్ ఎమ్ రామచంద్ర ఈ సందర్భంగా పిలుపు ఇచ్చారు.