

(మన న్యూస్ ప్రతినిధి) ఏలేశ్వరం: ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం మూలంగా ఈ నెల లో వర్షాలు వచ్చే అవకాశం ఉన్నందున మండలంలోని పేరవరం, భద్రవరం, లింగంపర్తి గ్రామాలను సందర్శించిన మండల వ్యవసాయ అధికారి బి జ్యోతి. ప్రస్తుతం కోత కోసి పొలంలో ఉన్న వరి పనలను కుప్పలుగా వేసుకోమని రైతులకు తెలపడం జరిగింది ఆరబెట్టి ఉన్న ధాన్యం దగ్గరలో ఉన్న మిల్లునకు పంపడం జరుగుతుంది అని లేదా సురక్షిత ప్రాంతంలో బరకాలు కప్పుకుని నిల్వ చేసుకోమని రైతులకు తెలపడం జరిగింది అన్నారు. వరి కోతలు కొన్ని రోజులు వాయిదా వేసుకోమని మరియు ఇతర వ్యవసాయ పనుల్లో రైతులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. పంట పొలాల్లో నిలిచే అదనపు నీటిని బయటకు పోయేలా ఏర్పాట్లు చేసుకోవాలన్నారు.మండలంలోని అన్ని గ్రామాల వ్యవసాయ సిబ్బంది పంట పొలాలను సందర్శించి రైతులకు భారీ వర్షాల సమయంలో తీసుకోవలసిన జాగ్రత్తలు గూర్చి వివరించడం జరిగింది.