

మన న్యూస్, నారాయణ పేట జిల్లా : మఖ్తల్ పట్టణంలోని వాసవీ కన్యకా పరమేశ్వరి ఆలయంలో ఆషాఢ మాసం సందర్భంగా ఆర్య వైశ్య మహిళా సంఘం ఆధ్వర్యంలో సామూహిక గోరింటాకు వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పెద్ద ఎత్తున మహిళలు ఒకరికొకరు గోరింటాకు పెట్టుకున్నారు. ఆషాఢ మాసంలో గోరింటాకు పెట్టుకోవడం వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య మహిళా సంఘం సభ్యులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.