కెసిఆర్ ఇక నీ జీవితం ఫామ్ హౌస్కే అంకితం – విమర్శలు గుప్పించిన తెలంగాణ కాంగ్రెస్ పార్టీ పినపాక మండల అధ్యక్షులు గోడిశాల రామనాధం

పినపాక, మన న్యూస్ :- వరంగల్ ఎల్కతుర్తిలో కెసిఆర్ నిర్వహించేది రజతోత్సవ సభ కాదని, అది గత తొమ్మిది సంవత్సరాల కాలంలో కెసిఆర్ చేసిన మోసాలను కప్పిపుచ్చుకునే కుతంత్రోత్సవ సభని.. పినపాక మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గోడిశాల రామనాధం ఆరోపించారు. ఈనాటి సభలో కెసిఆర్ ప్రజలకు ఏం చెబుతారో, దళితులకు మూడెకల భూమి ఎకరాల భూమి ఇచ్చామని చెబుతారా, దళితున్ని ముఖ్యమంత్రి చేస్తామని చెబుతారా, లేకపోతే ప్రతిపక్షంలో ఉండి కూడా ఎర్రవల్లి ఫామ్ హౌస్ లోనే పడుకుంటానని చెబుతాడా అని విమర్శించారు. రాష్ట్రాన్ని పాలించిన తొమ్మిది సంవత్సరాలు కాలం రావణాసురుడి పాలన సాగించాడని, కూతురు కొడుకు అల్లుడుకే పదవుల పట్టం కట్టాడని, కెసిఆర్ ని మించిన పనికిమాలిన ముఖ్యమంత్రిని చరిత్రలోనే చూడలేదని గొడిశాల దుయ్యబట్టారు. వరంగల్ సభకు 10 లక్షల మంది హాజరవుతున్నారు అని చెబుతున్న కేసిఆర్, ఈ సభ ఏర్పాట్లకు కొన్ని వందల కోట్ల రూపాయలు ఎక్కడి నుంచి తీసుకొచ్చారు చెబుతారా అని ప్రశ్నించారు. కట్టిన సంవత్సరం కాలంలోనే కూలిపోయిన కాలేశ్వరం కాలంలోనే కృంగిపోయిన కాలేశ్వరం, కవితక్క ఢిల్లీ లిక్కర్ స్కాం గురించి చెబితే తెలంగాణ ప్రజలు బాగా అర్థం చేసుకుంటారని అన్నారు. మాయల మరాఠీ వేషాలు ఎన్ని వేసిన కేసిఆర్ ను గానీ కెసిఆర్ తొత్తులను గాని తెలంగాణ ప్రజలు నమ్మే పరిస్థితుల్లో లేరని, ప్రజల మభ్యపెట్టి ధనము మందు ఆశ చూపించి తీసుకెళ్లినారు తప్ప, బిఆర్ఎస్ పార్టీని చూసి ఎవరు రాలేదని అన్నారు. వచ్చే ఎన్నికల్లో టిఆర్ఎస్ పార్టీ పూర్తిగా సమాధిలో కూరుకు పోతుందని, ఇకనైనా బుద్ధి తెచ్చుకొని కెసిఆర్ కెసిఆర్ అల్లుడు కొడుకు కూతురు ప్రజలకు మేలు చేసే విధంగా రాజకీయాలు చేయాలని, లేకుంటే కెసిఆర్ రాజకీయ సన్యాసం తీసుకుని ఎర్రబెల్లి ఫామ్ హౌస్ లోనే శేష జీవితాన్ని గడపాలని సూచించారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ మైనార్టీ సెల్ అధ్యక్షుడు బసీరుద్దీన్, కాంగ్రెస్ సీనియర్ నాయకులు స్వతంత్ర రెడ్డి, కొంపెల్లి నాగేష్, మనోజ్, ఆదినారాయణ తదితరులు పాల్గొన్నారు.

Related Posts

కేబుల్ & ఇంటర్నెట్ ఆపరేటర్లబ్రతుకులు రోడ్డుపై పడతాయిసమస్యలను పరిష్కరించండి

మహేశ్వరం, మన ధ్యాస: మహేశ్వరం నియోజకవర్గంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో,కేబుల్ ఇంటర్నెట్ ఆపరేటర్లు మాజీ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి ని మర్యాదపూర్వకంగా కలిసి తమ సమస్యలను వివరించారు.రాష్ట్రవ్యాప్తంగా సుమారు 5 లక్షల మంది ఆపరేటర్లు ఈ వృత్తిపై ఆధారపడి…

హసన్‌పల్లి గ్రామంలో విద్యుత్ సమస్యకు శాశ్వత పరిష్కారం: మన ధ్యాస న్యూస్ కథనానికి స్పందన

మన ధ్యాస, నిజాంసాగర్ (జుక్కల్):మొహమ్మద్ నగర్ మండలంలోని హసన్‌పల్లి గ్రామంలో గత రెండు సంవత్సరాలుగా అధిక లోడు కారణంగా విద్యుత్ సరఫరాలో తీవ్రమైన సమస్యలు కొనసాగుతూ ఉండగా,మన ధ్యాస దినపత్రిక ఆదివారం ఒక కథనాన్ని ప్రచురించింది.ఇందులో ట్రాన్స్ఫార్మర్ కాలిపోయి వదిలివేయబడినట్లు, అందువల్ల…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed Mana News updates

చిత్తూరు లో హరిణి రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలు

చిత్తూరు లో హరిణి రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలు

కేబుల్ & ఇంటర్నెట్ ఆపరేటర్లబ్రతుకులు రోడ్డుపై పడతాయిసమస్యలను పరిష్కరించండి

కేబుల్ & ఇంటర్నెట్ ఆపరేటర్లబ్రతుకులు రోడ్డుపై పడతాయిసమస్యలను పరిష్కరించండి

విద్యార్థులు తమ తల్లిదండ్రులకు సైబర్ నేరాలపై అవగాహన కల్పించాలి.–సైబర్ క్రైమ్ సెక్యూరిటీ కౌన్సిల్ ప్రదీప్ కొత్తపల్లి పిలుపు.

  • By JALAIAH
  • September 11, 2025
  • 3 views
విద్యార్థులు తమ తల్లిదండ్రులకు సైబర్ నేరాలపై అవగాహన కల్పించాలి.–సైబర్ క్రైమ్ సెక్యూరిటీ కౌన్సిల్ ప్రదీప్ కొత్తపల్లి పిలుపు.

సురక్షత మైన డ్రైవింగ్ కుటుంబానికి భద్రత…

సురక్షత మైన డ్రైవింగ్ కుటుంబానికి భద్రత…

విద్యార్థుల సామర్థ్యాలకు అనుగుణం గానే బోధన…

విద్యార్థుల సామర్థ్యాలకు అనుగుణం గానే బోధన…

సిఫార్సు మోతాదులోనే రైతులు ఎరువుల వాడకం చేపట్టాలి..

సిఫార్సు మోతాదులోనే రైతులు ఎరువుల వాడకం చేపట్టాలి..