మన న్యూస్,నిజాంసాగర్, జుక్కల్,రైతులకు కొనుగోలు కేంద్రానికి తీసుకువచ్చిన వరి ధాన్యాన్ని సకాలంలో కొనుగోలు వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ అన్నారు. సోమవారం నిజాంసాగర్ మండలంలోని గోర్గల్ వరి ధాన్యం కొనుగోలు కేంద్రంను కలెక్టర్ పరిశీలించారు.అకాల వర్షాలు కురిసే ఆస్కారం ఉన్నందున రైతులకు టార్పాలిన్స్ అందజేయాలని సూచించారు.కొనుగోలు చేసిన ధాన్యాన్ని వెంటది వెంటనే మిల్లులకు తరలించాలని అన్నారు.ఇప్పటి వరకు వచ్చిన ధాన్యం వివరాలు, కొనుగోళ్లు జరిగిన వాటి వివరాలు కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు.కొనుగోలు కేంద్రాల్లో త్రాగునీరు,నీడ, వంటి ఏర్పాట్లు చేయాలనీ తెలిపారు.రైతుల మాట్లాడుతూ..లారీల కొరత ఉందని తెలిపారు.
ఈ కార్యక్రమంలో తహసీల్దార్ బిక్షపతి,మండల వ్యవసాయ అధికారి అమర్ ప్రసాద్, సొసైటీ సీఈఓ సంకేమేశ్వర్ గౌడ్,రైతులు,తదితరులు పాల్గొన్నారు.

By RAHEEM

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *