

పినపాక, మన న్యూస్ :- సోమవారం తెల్లవారు జామున వేములవాడ వెళ్తున్న క్రమంలో తాడ్వాయి అడవిలో రంగాపురం వైపు వొస్తున్న గుర్తుతెలియని బొలెరో వాహనం డీ కొనడం తో గోపాలరావుపేట కు చెందిన కాంగ్రెస్ నేత గోరంట్ల శ్రీను అక్కడికక్కడే మృతి చెందారు.వివరాలు ఇలా ఉన్నాయి గోపాలరావుపేట గ్రామానికి చెందిన గోరంట్ల శ్రీను కుమారుడి వివాహ అనంతరం మొక్కు చెల్లింపు కొరకు సోమవారం తెల్లవారు జామున బయల్దేరారు. తాడ్వాయి అడవిలో అతి వేగంగా వస్తున్న బులెరో వాహనం డీ కొట్టింది.శ్రీను తలకు తీవ్రంగా దెబ్బ తగలడంతో అధిక రక్త స్రావం తో శ్రీను అక్కడికక్కడే మృతి చెం దారు. ఘటనా స్థలం నుండి ప్రమాదానికి కారణమైన బొలెరో వాహనం పరార్ కాగా పలువురికి గాయాలయ్యాయి.గోరంట్ల శ్రీను పినపాక శాసనసభ్యులు పాయం వెంకటేశ్వర్లు ముఖ్య అనుచరుడు. రాజకీయ జీవితంలో సుదీర్ఘకాలం పాటు పాయం వెంట ప్రయాణించారు.కాగ మృతుడి భార్య కూడా 10 సంవత్సరాల క్రితం అనారోగ్యంతో మరణించారు. తల్లిదండ్రులను కోల్పోయిన ఇద్దరు కుమారులు విగత జీవులుగా మిగిలారు. కుమారుడి వివాహం అయిన నాలుగు రోజులకే రోడ్డు ప్రమాద రూపంలో శ్రీను అకాల మరణం చెందడంతో ఆ కుటుంబంలో,గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.