

- కోట్లాది మందికి స్ఫూర్తినిచ్చే అధినేత నారా చంద్రబాబు…
- సైబరాబాద్ నిర్మాణం, హైటెక్ సిటీ స్థాపన ఆయన విజన్‌కు నిదర్శనాలు…
- ఆయన రాజకీయ చతురత, పరిపాలనా దక్షత, ప్రజలను మెప్పించే వాక్చాతుర్యం..
శంఖవరం మన న్యూస్ (అపురూప్) : నాలుగు దశాబ్దాలకు పైగా రాజకీయాల్లో కొనసాగుతూ, చంద్రబాబు నాయుడు ఎన్నో విజయాలు సాధించారని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర టిఎన్టి యుసి ఉపాధ్యక్షులు వెన్న ఈశ్వరుడు (శివ) సూచించారు.ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు 75వ పుట్టినరోజు సందర్భంగా ప్రత్తిపాడు ఎమ్మెల్యే వరుపుల సత్యప్రభ ఆదేశాల మేరకు కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం శంఖవరం మండలం కత్తిపూడి టీడీపీ కార్యాలయంలో వెన్న శివ ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా కేక్ కట్ చేసి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం స్వీట్లు పంచారు. ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ రాష్ట్ర టిఎన్టియుసి ఉపాధ్యక్షులు వెన్న ఈశ్వరుడు శివ మాట్లాడుతూ, హైదరాబాద్‌ను ఐటీ హబ్‌గా మార్చడంలో ఆయన కీలక పాత్ర పోషించారని, ఆయన పరిపాలనా విధానాలు, సంస్కరణలు ఎన్నో రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచాయని, ప్రజల నాడిని పసిగట్టగల నాయకుడిగా ఆయన గుర్తింపు పొందారని అన్నారు.భారత రాజకీయ చరిత్రకు వన్నె తెచ్చిన పాలనతో… సమ సమాజ మానవత్వపు భావనలతో… వెనుకడుగు వేయని పోరాటపటిమతో, సాధించేవరకు విరామం ప్రకటించని కార్యదక్షతతో… కోట్లాది మందికి స్ఫూర్తినిచ్చే అధినేత, తెలుగు వెలుగు నారా చంద్రబాబు నాయుడు నేడు పుట్టినరోజు 75వ వసంతంలోకి అడుగు పెడుతున్న ఆయన రాజకీయ ప్రస్థానం ఒక సుదీర్ఘ గాథ అని నాలుగు దశాబ్దాలకు పైగా రాజకీయాల్లో కొనసాగుతూ.. ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొంటూ, తనదైన ముద్ర వేశారు. ఆయన రాజకీయ చతురత, పరిపాలనా దక్షత, ప్రజలను మెప్పించే వాక్చాతుర్యం ఆయనను ఒక ప్రత్యేక నాయకుడిగా నిలిపాయి అన్నారు.గతంలో కూడా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి ఎంతో కృషి చేశారని కొనియాడారు. ముఖ్యంగా.. హైదరాబాద్‌ను ఐటీ హబ్‌గా మార్చడంలో ఆయన కీలక పాత్ర పోషించారు. సైబరాబాద్ నిర్మాణం, హైటెక్ సిటీ స్థాపన ఆయన విజన్‌కు నిదర్శనాలు. ఆయన పరిపాలనా విధానాలు, సంస్కరణలు ఎన్నో రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచాయి అని అన్నారు.చంద్రబాబు నాయుడు రాజకీయ జీవితంలో ఎన్నో విజయాలు సాధించారు. ప్రజల ఆకాంక్షలను ప్రతిబింబించేలా ఆయన విధానాలు రూపొందించగలరని, చంద్రబాబు తీసుకున్న నిర్ణయాలను ప్రజలు ఆమోదించేలా చేయగలరని అన్నారు. ఆయన రాజకీయ వ్యూహాలు, ప్రత్యర్థులను ఎదుర్కొనే తీరు ఎంతోమందికి ఆదర్శమని తెలిపారు.అనంతరం తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు బద్ది రామారావు మాట్లాడుతూ,ఆయన నాయకత్వంలో ఎంతోమంది రాజకీయ నాయకులు ఎదిగారు. ఆయనను ఒక గురువుగా భావించేవారు ఎందరో ఉన్నారన్నారు. చంద్రబాబు నాయుడు రాజకీయ జీవితం ఎన్నో ఆటు పోట్లతో కూడుకున్నది. ఆయన ఎన్నో సవాళ్లను ఎదుర్కొన్నారు. ప్రతి సవాలును ఒక అవకాశంగా మలుచుకుని ముందుకు సాగారని ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఆయన పట్టుదల, కృషి, అంకితభావం ఆయనను విజయవంతమైన నాయకుడిగా నిలిపాయన్నారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు బద్ది రామారావు, బుర్ర వాసు, బొమ్మిడి సత్యనారాయణ మాజీ ఎంపీటీసీ కంచిబోయిన శ్రీను సాధనాల లక్ష్మణ బాబు, గాబు కృష్ణ, దేశి లింగ వెంకట రమణ, గజ్జి సత్యనారాయణ, కేళంగి జాన, నక్క శ్రీను, గాబు శివ, మచ్చ రాజు, బద్ది రమణ, కొయ్య రమణ, దూది సూరిబాబు, ఆలపు సత్యనారాయణ, కంది కోళ్ల హరీష్, పాలెపు దుర్గారావు, మిత్యాల సురేంద్ర తదితర టిడిపి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.