

ఉప్పిలిపల్లి లో వాలీబాల్ టోర్నమెంట్ ప్రారంభించిన డాక్టర్ రాహుల్
మన న్యూస్, ఎస్ఆర్ పురం:- గంగాధర్ నెల్లూరు నియోజకవర్గ యువతకు అండగా నేనుంటానని ప్రభుత్వ విప్ జీడీ నెల్లూరు ఎమ్మెల్యే డాక్టర్ థామస్ తనయుడు డాక్టర్ రాహుల్ అన్నారు ఆదివారం పెనుమూరు మండలం ఉప్పిలిపల్లి గ్రామంలో రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జన్మదిన సందర్భంగా వన్డే వాలీబాల్ టోర్నమెంట్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే తనయుడు డాక్టర్ రాహుల్ పాల్గొన్నారు వాలీబాల్ టీం డాక్టర్ రాహుల్ కు పుల వర్షంతో స్వాగతం పలికారు వాలీబాల్ టీం ను పరిచయ కార్యక్రమం నిర్వహించారు అనంతరం వాలీబాల్ సరదాగా డాక్టర్ రాహుల్ ఆడారు అనంతరం డాక్టర్ రాహుల్ మాట్లాడుతూ మానసిక ఉల్లాసం కోసం క్రీడలు ఎంతో అవసరం అని ప్రతి క్రీడను ఉత్సాహంగా ఆడుకోవాలని గెలుపు ఓటములు సహజమని క్రీడాకారులకు డాక్టర్ రాహుల్ తెలిపారు.. అనంతరం గ్రామస్తులు టిడిపి అభిమానులు డాక్టర్ రాహుల్ ను సాలువ తో ఘనంగా సన్మానించి సత్కరించారు.. వాలీబాల్ విజేతలకు బహుమతులు ప్రధానం చేశారు ఈ కార్యక్రమంలో పెనుమూరు మండల అధ్యక్షుడు రుద్రయ్య నాయుడు మీడియా కోఆర్డినేటర్ బాబు యాదవ్ వాలీబాల్ టోర్నమెంట్ ఆర్గనైజర్ ఎన్ఎస్ రాజు పవన్ తలారి రెడ్డప్ప రాజశేఖర్ నాయుడు టిడిపి మహిళా నాయకురాలు ఇందిరమ్మ,కృష్ణమూర్తి నాయుడు ప్రభుత్వ వ్యక్తిగత కార్యదర్శి చంద్రశేఖర్, యోనా, నాయకులు తదితరులు పాల్గొన్నారు.
