హోప్ హైలాండ్ లో ఎకో టూరిజం ను అభివృద్ధి చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చెయ్యండి-కాకినాడ జిల్లా కలెక్టర్ షణ్మోహన్

కాకినాడ / గొల్లప్రోలు మార్చి 10 మన న్యూస్:- హోప్ హైలాండ్ లో ఎకో టూరిజంని అభివృద్ధి చేసేందుకు అవసరమైన ప్రణాళికను సిద్ధం చేయాలని జిల్లా కలెక్టర్ షణ్మోహన్ అధికారులు ఆదేశించారు.సోమవారం జిల్లా కలెక్టర్ షణ్మోహన్..జిల్లా ఎస్పీ జి.బిందు మాధవ్, జిల్లా అటవీ శాఖ అధికారి ఎ.రవీంద్రనాథ్ రెడ్డి, పోర్టు అధికారి కెప్టెన్ ధర్మశాస్త, అటవీ, పర్యాటక, మత్స్య, మెరైన్ పోలీస్ శాఖల అధికారులతో కలిసి హోప్ ఐలాండ్ లో పర్యటించారు. కాకినాడ సముద్ర తీరంలో ఉన్న రాష్ట్ర ప్రత్యేక రక్షణ దళం కార్యాలయం నుంచి హోప్ ఐలాండ్ కు చేరుకుని అక్కడి ప్రదేశాలను పరిశీలించారు. ఎకో టూరిజంని అభివృద్ధికి అనువుగా ఉన్న పరిస్థితులు, హోప్ హైలాండ్ పరిధి, మడ అడవులు, వన్యప్రాణుల సంరక్షణ, సందర్శకులకు బోటింగ్ సౌకర్యం ఇతర అంశాలను జిల్లా కలెక్టర్ షణ్మోహన్..ఆయా శాఖల అధికారులతో ఈ సందర్భంగా చర్చించి, వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హోప్ ఐలాండ్ ప్రాంతాన్ని పర్యాటక రంగానికి కేంద్రంగా తీర్చిదిద్దేందుకు అవసరమైన ప్రణాళికలను సిద్ధం చేయాలన్నారు. ఇందుకు వివిధ శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని ఆయన సూచించారు. ఈ పరిశీలనలో జిల్లా కలెక్టర్ వెంట జిల్లా మత్స్యశాఖ అధికారి కె. కరుణాకర్ బాబు, ఫారెస్ట్ రేంజ్ అధికారి ఎస్ఎస్ఆర్.వరప్రసాద్, సెక్షన్ అధికారి ఎం. నాగార్జున, అసిస్టెంట్ టూరిజం అధికారి వి. త్రిమూర్తులు, వాటర్ ఫ్లీట్ అసిస్టెంట్ మేనేజర్ గంగా బాబు, పోర్ట్ సీఐ పీ.సునీల్ కుమార్, మెరైన్ ఎస్సై పీ.సురేష్ ఇతర శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Related Posts

ఎప్పుడు ఎన్నికలు పెట్టినా ఒన్ సైడ్ గా గెలిపించండి

సూపర్ సిక్స్ విజయోత్సవ వేదికగా ఆటో డ్రైవర్లకు  కానుక దసరాకు ఆటో డ్రైవర్లకు రూ.15వేల ఆర్ధిక సాయం చేస్తామని ప్రకటించిన సీఎం రప్పారప్పా అంటే చూస్తూ ఊరుకోమని హెచ్చరిక వైసీపీ నాయకుడిది దృతరాష్ట్ర కౌగిలి అని ఎద్దేవా చేసిన ముఖ్యమంత్రి  సీమ…

వాతావరణ మార్పుల ప్రభావం–ఆరోగ్య జాగ్రత్తలు తప్పనిసరి: శివ కిషోర్

ఉరవకొండ మన ధ్యాస: వజ్రకరూరు మండల కేంద్రంలోని స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో బుధవారం క్లైమేట్ కేర్ ఛాంపియన్స్ ప్రోగ్రాం (స్వస్తి ) బృందం తనిఖీ చేశారు. శివ కిషోర్ స్టేట్ ప్రోగ్రాం మేనేజర్, డాక్టర్ తన్మయి మేనేజర్ వేదిక అసోసియేట్…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed Mana News updates

దళితుల స్థలాలను ఆక్రమించిన వారిపై చర్యలు తీసుకోవాలి కొప్పాల రఘు…వివాదాస్పదమైన జి చెర్లోపల్లి గ్రామాన్ని సందర్శించిన డివిఎంసి సభ్యులు…///

  • By NAGARAJU
  • September 10, 2025
  • 1 views
దళితుల స్థలాలను ఆక్రమించిన వారిపై చర్యలు తీసుకోవాలి కొప్పాల రఘు…వివాదాస్పదమైన జి చెర్లోపల్లి గ్రామాన్ని సందర్శించిన డివిఎంసి సభ్యులు…///

అనంతపురంలో ఘనంగా “సూపర్ సిక్స్ సూపర్ హిట్” సభ..సూపర్ సిక్స్- సూపర్ హిట్ సభలో పాల్గొన్న ఎమ్మెల్యే కాకర్ల సురేష్…///

  • By NAGARAJU
  • September 10, 2025
  • 3 views
అనంతపురంలో ఘనంగా “సూపర్ సిక్స్  సూపర్ హిట్” సభ..సూపర్ సిక్స్- సూపర్ హిట్ సభలో పాల్గొన్న ఎమ్మెల్యే కాకర్ల సురేష్…///

ఎప్పుడు ఎన్నికలు పెట్టినా ఒన్ సైడ్ గా గెలిపించండి

ఎప్పుడు ఎన్నికలు పెట్టినా ఒన్ సైడ్ గా గెలిపించండి

ఎన్నికల్లో హామీలు ఇచ్చాం ఎన్ని కష్టాలు వచ్చినా తీర్చాం.

ఎన్నికల్లో హామీలు ఇచ్చాం ఎన్ని కష్టాలు వచ్చినా తీర్చాం.

వాతావరణ మార్పుల ప్రభావం–ఆరోగ్య జాగ్రత్తలు తప్పనిసరి: శివ కిషోర్

వాతావరణ మార్పుల ప్రభావం–ఆరోగ్య జాగ్రత్తలు తప్పనిసరి: శివ కిషోర్

ఉపరాష్ట్రపతి ఎన్నిక కేవలం వ్యక్తి ఎన్నిక కాదు

ఉపరాష్ట్రపతి ఎన్నిక కేవలం వ్యక్తి ఎన్నిక కాదు